iDreamPost

Virat Kohli: ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్.. కోహ్లీ ప్లేసులో RCB ప్లేయర్.. వాళ్ల శకం ముగిసినట్లే?

  • Published Jan 24, 2024 | 9:02 AMUpdated Jan 24, 2024 | 9:02 AM

ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి ప్లేసులో ఓ ఆర్సీబీ ప్లేయర్​ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఒక్క ఛాన్స్ కోసం ఆశిస్తున్న వాళ్లిద్దరికీ మాత్రం మళ్లీ మొండిచేయి చూపారు సెలక్టర్లు.

ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి ప్లేసులో ఓ ఆర్సీబీ ప్లేయర్​ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఒక్క ఛాన్స్ కోసం ఆశిస్తున్న వాళ్లిద్దరికీ మాత్రం మళ్లీ మొండిచేయి చూపారు సెలక్టర్లు.

  • Published Jan 24, 2024 | 9:02 AMUpdated Jan 24, 2024 | 9:02 AM
Virat Kohli: ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్.. కోహ్లీ ప్లేసులో RCB ప్లేయర్.. వాళ్ల శకం ముగిసినట్లే?

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్​కు అంతా రెడీ అయింది. ఈ టాప్ టీమ్స్ మధ్య రేపటి నుంచి హైదరాబాద్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిఫ్ ఫైనల్స్​కు చేరుకోవాలంటే ఈ సిరీస్​లో నెగ్గడం రెండు జట్లకూ చాలా కీలకంగా మారింది. అందుకే ఈ సిరీస్​ను భారత్-ఇంగ్లండ్ చాలా సీరియస్​గా తీసుకుంటున్నాయి. అయితే తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఇంగ్లండ్​ బజ్​బాల్​ ఫార్ములాను అతడు చిత్తు చేస్తాడని అంతా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే పర్సనల్ రీజన్స్ వల్ల హఠాత్తుగా ఇంటికి వెళ్లిపోయాడు కింగ్. సిరీస్​లోని మిగతా మూడు మ్యాచులకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. దీంతో కోహ్లీ ప్లేస్​ను ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే విరాట్‌ స్థానంలో ఆర్సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్​ను జట్టులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

కోహ్లీ ప్లేసులో రజత్ పాటిదార్​ను తీసుకోవడం దాదాపుగా కన్ఫర్మ్ అయిందట. సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆప్షన్లు ఉన్నా రజత్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారని తెలిసింది. ఇటీవల ఇంగ్లండ్-ఏ జట్టుతో జరిగిన టెస్టులో భారీ సెంచరీ చేయడం అతడికి బిగ్ ప్లస్​గా మారిందని అంటున్నారు. అయితే టీమ్​లో చోటు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వెటరన్ ప్లేయర్లు పుజారా, అజింక్యా రహానేతో పాటు యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్​కు మరోమారు మొండిచేయి చూపినట్లు అర్థమవుతోంది. రహానె సరైన ఫామ్​లో లేడు. రంజీ ట్రోఫీ-2024లో అతడు దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. కానీ పుజారా మాత్రం బాగా ఆడుతున్నాడు. రీసెంట్​గా జార్ఖండ్​తో జరిగిన మ్యాచ్​లో డబుల్ సెంచరీ కూడా బాదాడు. అయినా అతడ్ని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్​కు మొండిచేయి చూపారని అర్థమవుతోంది.

RCB player at Kohli's place!

రజత్ పాటిదార్​ సెలక్షన్​పై బీసీసీఐ మరికొంత సేపట్లో అధికారిక ప్రకటన చేస్తుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో వెటరన్ క్రికెటర్లు పుజారా, రహానె శకం ఇక ముగిసినట్లేనని చెబుతున్నాయి. ఇంక వాళ్లు డొమెస్టిక్ క్రికెట్​కే పరిమితం అవుతారని కామెంట్స్ చేస్తున్నాయి. పుజారా, రహానె విషయాన్ని పక్కనబెడితే ఇంతగా రాణిస్తున్నా సర్ఫరాజ్​ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదనేది చాలా మందికి అర్థం కావట్లేదు. అయితే ఫిట్​నెస్, అధిక బరువు లాంటి కారణాల వల్లే అతడికి సెలక్టర్లు మొండిచేయి చూపిస్తున్నారని కొందరు అనలిస్టులు చెబుతున్నారు. ఒకవేళ బరువు తగ్గించుకొని ఫిట్​గా మారితే అతడి అరంగేట్రం ఖాయమని చెబుతున్నారు. ఇక, కోహ్లీ ప్లేసులో ఎవర్ని టీమ్​లోకి తీసుకున్నా తుదిజట్టులో చోటు మాత్రం కష్టమే. విరాట్ స్థానంలో శుబ్​మన్ గిల్ దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. కోహ్లీ స్థానంలో రజత్​ పాటిదార్​ను తీసుకోనున్నారనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి