iDreamPost

భారత్​కు శాపంగా మారిన అంపైర్లు.. ఇంక కోలుకోవడం కష్టమే!

  • Published Feb 24, 2024 | 5:47 PMUpdated Feb 24, 2024 | 5:47 PM

నాలుగో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్​కు అంపైర్లు శాపంగా మారారు. ఈ దెబ్బ నుంచి రోహిత్ సేన కోలుకోవడం కష్టమే.

నాలుగో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్​కు అంపైర్లు శాపంగా మారారు. ఈ దెబ్బ నుంచి రోహిత్ సేన కోలుకోవడం కష్టమే.

  • Published Feb 24, 2024 | 5:47 PMUpdated Feb 24, 2024 | 5:47 PM
భారత్​కు శాపంగా మారిన అంపైర్లు.. ఇంక కోలుకోవడం కష్టమే!

వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించడంతో ఫుల్ జోష్​లో కనిపించిన టీమిండియా.. అదే ఊపును కంటిన్యూ చేయలేకపోయింది. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు ఎదురీదుతోంది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్​లో 353 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన రోహిత్ సేన 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లీష్ బ్యాటర్లు సక్సెస్ అయిన చోటు మనోళ్లు మాత్రం చేతులెత్తేశారు. సీనియర్లు రోహిత్ శర్మ (2), ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా (12)తో పాటు యంగ్ బ్యాటర్స్ అంతా ఫెయిలయ్యారు. ఒక్క యశస్వి జైస్వాల్ (73) మాత్రం ప్రామిసింగ్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్​లో అంపైరింగ్ మిస్టేక్స్ భారత్​కు శాపంగా మారాయి. అంపైర్లు చేసిన తప్పుదాలకు మన టీమ్​లోని ముగ్గురు బ్యాటర్లు బలయ్యారు.

టీమిండియా యంగ్ బ్యాటర్స్ శుబ్​మన్ గిల్​, రజత్ పాటిదార్​తో పాటు రవిచంద్రన్ అశ్విన్​ను అంపైర్లు ముంచేశారు. వాళ్లు చేసిన తప్పదాలకు వీళ్లు బలయ్యారు. ఈ ముగ్గురూ నాటౌట్. కానీ అంపైర్స్ కాల్ వల్ల ఔటై క్రీజును వీడాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ (2) త్వరగా ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చిన గిల్ (38) బాగా ఆడుతున్నట్లు కనిపించాడు. అప్పటికే 6 బౌండరీలు బాదిన యంగ్ బ్యాటర్.. భారీ స్కోరు చేయడం పక్కా అని అంతా అనుకున్నారు. కానీ ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్​లో అతడు ఎల్బీడబ్ల్యూగా నిష్క్రమించాడు. బషీర్ వేసిన బాల్ ఆఫ్ స్టంప్​కు బయట పడి గిల్ బ్యాట్​ను దాటుకొని ప్యాడ్స్​కు తగిలింది. దీంతో అంపైర్ ఎల్బీడబ్ల్యూ కింద ఔట్ ఇచ్చేశాడు. కానీ భారత్ డీఆర్​ఎస్​కు వెళ్లింది. అందులో బాల్ క్లియర్​గా లెగ్ స్టంప్​ను మిస్ అయినట్లు తేలింది. కానీ అంపైర్స్ కాల్​ కింద గిల్​ను ఔట్​గా ప్రకటించారు.

ఫీల్డ్ అంపైర్ గనుక ముందే నాటౌట్ ఇచ్చి ఉంటే ఎల్బీడబ్ల్యూ విషయంలో గిల్ బతికిపోయేవాడు. కానీ అంపైర్ ఔట్ ఇచ్చేయడంతో అతడు క్రీజును వీడక తప్పలేదు. రజత్ పాటిదార్ (17) విషయంలోనూ సేమ్ ఇలాగే జరిగింది. అతడితో పాటు అశ్విన్ (1) విషయంలోనూ అంపైర్స్ కాల్ శాపంగా మారింది. ఈ ముగ్గురు బ్యాటర్లు ఔట్ కాకపోయినా అంపైర్స్ కాల్​ వల్ల క్రీజును వీడారు. ఈ ముగ్గురూ ఎల్బీడబ్ల్యూలుగా ఔట్ అయ్యారు. ఇందులో గిల్, పాటిదార్​ వికెట్లు బషీర్​కు దక్కగా.. అశ్విన్​ వికెట్ మరో స్పిన్నర్ టామ్ హార్ట్​లీ అకౌంట్​లో పడింది. గిల్, పాటిదార్ మంచి స్టార్ట్ దొరికాక ఔట్ అయ్యారు. వాళ్లిద్దరూ గనుక ఉండి ఉంటే భారత జట్టు భారీ స్కోరు చేసేది. కానీ అంపైరింగ్ తప్పిదాలు శాపంగా మారడంతో కష్టాల్లో పడింది. ఇప్పుడు మన టీమ్ 68 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 213 పరుగులతో ఉంది. ధృవ్ జురెల్ (27 నాటౌట్), కుల్దీప్ యాదవ్ (16 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ జోడీ ఎంత సేపు క్రీజులో ఉంటుందనే దాని మీదే మన టీమ్ భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయి. మరి.. రాంచీ టెస్టులో అంపైర్ల నిర్ణయాల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నిన్న లాస్ట్ బాల్ సిక్స్ కొట్టిన సజనా.. ఓ తెలుగు సినిమాలో హీరోయిన్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి