Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. కింగ్ దూరమవడంతో అభిమానుల కోరిక అలాగే ఉండిపోయింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. కింగ్ దూరమవడంతో అభిమానుల కోరిక అలాగే ఉండిపోయింది.
Nidhan
విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోని తొలి రెండు మ్యాచులకు దూరమైన ఈ సీనియర్ బ్యాటర్.. మిగిలిన మూడు టెస్టుల్లోనైనా బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. కానీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు. సిరీస్‌లోని మిగిలిన మ్యాచులకు కూడా కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ నుంచి విరాట్ తప్పుకున్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. చివరి మూడు టెస్టులకు టీమ్‌ను ఇవాళ ప్రకటించింది బీసీసీఐ. అనుకున్నట్లుగానే కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమవగా.. ఇంజ్యురీ వల్ల రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కోహ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. తమ కోరిక నెరవేరకుండానే ఉండిపోయిందని బాధపడుతున్నారు.
క్రికెట్లో కొన్ని పోరాటాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. కొన్ని టీమ్స్ తలపడుతున్నాయన్నా.. కొందరు ఆటగాళ్లు ఢీకొంటున్నారన్నా చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతారు. అలాంటి అరుదైన ఫైట్లలో ఒకటి జేమ్స్ అండర్సన్-విరాట్ కోహ్లీది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అయిన అండర్సన్‌కు భారత స్టార్ బ్యాటర్ కోహ్లీకి మధ్య చాన్నాళ్లుగా శత్రుత్వం ఉంది. అయితే ఇది గ్రౌండ్‌కు మాత్రమే పరిమితమైన శత్రుత్వం. వ్యక్తిగతంగా ఇద్దరూ ఒకరితో ఒకరు బాగానే ఉంటారు. కానీ మైదానంలో ఎదురుపడితే మాత్రం కొదమసింహాల్లా పోట్లాడతారు. టెస్టు క్రికెట్లో కోహ్లీ, అండర్సన్ గతంలో చాలాసార్లు పోటీపడ్డారు. అందులో 7 సార్లు విరాట్‌ను జిమ్మీ ఔట్ చేశాడు. అండర్సన్ బౌలింగ్‌లో మొత్తంగా 710 బంతులు ఎదుర్కొన్న కింగ్ 43.6 యావరేజ్‌తో 305 పరుగులు చేశాడు.
కోహ్లీని ఔట్ చేయాలని అండర్సన్, జిమ్మీ బౌలింగ్‌ను ఉతికి ఆరేయాలని విరాట్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. వీళ్లిద్దరూ ఎదుర్కొన్న మ్యాచుల్లో కొన్నిసార్లు టీమిండియా బ్యాటర్‌ది ఆధిపత్యం కాగా.. మరికొన్ని సార్లు అండర్సన్ డామినేషన్ నడిచింది. ఈసారి భారత పర్యటనలో 5 టెస్టులు ఆడేందుకు ఇంగ్లీష్ టీమ్ వచ్చింది. దీంతో వీళ్ల మధ్య మరోమారు ఆసక్తికర పోరు నడుస్తుందని అంతా అనుకున్నారు. కానీ తొలి రెండు మ్యాచుల్లో కోహ్లీ ఆడకపోవడంతో ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. తాజాగా చివరి మూడు టెస్టుల నుంచి అతడు తప్పుకోవడంతో కోహ్లీ-అండర్సన్ వార్ చూసే ఛాన్స్ మిస్సయింది. అందుకే అభిమానులు తమ కోరిక అలాగే ఉండిపోయిందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మోడర్న్ క్రికెట్లో గ్రేటెస్ట్ బ్యాటిల్ ముగిసిపోయిందని చెబుతున్నారు. మరి.. కోహ్లీ-అండర్సన్ వార్ మిస్సవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Akash Deep: తండ్రి, సోదరుడి మరణం.. ఎన్నో కష్టాలు.. కట్ చేస్తే టీమిండియాలోకి! ఎవరీ ఆకాష్ దీప్?
Virat Kohli vs James Anderson in Test cricket:
Runs – 305
Balls – 710
Average – 43.6
Outs – 7End of the greatest battle in the modern Era. 🫡 pic.twitter.com/evyRThV44T
— Johns. (@CricCrazyJohns) February 10, 2024