iDreamPost

Akash Deep: తండ్రి, సోదరుడి మరణం.. ఎన్నో కష్టాలు.. కట్ చేస్తే టీమిండియాలోకి! ఎవరీ ఆకాష్ దీప్?

ఆకాష్ దీప్.. ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన పేరు. ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్ట్ లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు ఆకాష్. మరి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, టీమిండియాకు ఎంపికైన విధానం ఓసారి పరిశీలిద్దాం రండి.

ఆకాష్ దీప్.. ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన పేరు. ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్ట్ లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు ఆకాష్. మరి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, టీమిండియాకు ఎంపికైన విధానం ఓసారి పరిశీలిద్దాం రండి.

Akash Deep: తండ్రి, సోదరుడి మరణం.. ఎన్నో కష్టాలు.. కట్ చేస్తే టీమిండియాలోకి! ఎవరీ ఆకాష్ దీప్?

ఇంగ్లాండ్ తో జరగబోయే మిగిలిన మూడు టెస్టులకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఇక మెుదటి నుంచి అందరూ అనుకుంటున్నట్లుగానే విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మెుత్తానికి దూరం అయ్యాడు. తాజాగా వెన్నునొప్పితో శ్రేయస్ అయ్యర్ కూడా టీమ్ కు అందుబాటులో లేడు. గాయం కారణంగా రెండో టెస్ట్ కు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల ఫిట్ నెస్ పై ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే జట్టులోకి అనూహ్యంగా దూసుకొచ్చాడు బెంగాల్ స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్. తొలిసారి సెలెక్టర్లు అవకాశం కల్పించారు. దీంతో ఎవరీ ఆకాష్ దీప్ అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఆకాష్ దీప్.. 1996 డిసెంబర్ 15న బీహార్ లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. చిన్న తనం నుంచే క్రికెట్ పై ఇష్టంతో అటువైపుగా అడుగులు వేశాడు. క్రికెట్ వైపు వెళ్తున్నక్రమంలోనే అతడి జీవితంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఈ బాధను మర్చిపోకముందే.. ఆకాష్ సోదరుడు కూడా కన్నుమూశాడు. ఈ రెండు విషాద సంఘటనలు అతడి జీవితాన్ని తలకిందులు చేశాయి. ఇన్ని కష్టాలు ఎదురైనప్పటికీ.. తన క్రికెట్ కలను మాత్రం వదులుకోలేదు. అయితే ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆకాష్ కు మరో ఎదురుదెబ్బతగిలింది.

సొంత రాష్ట్రమైన బీహార్ లో అవకాశాలు రాకపోవడంతో.. పశ్చిమ బెంగాల్ కు వలస వెళ్లాడు. అక్కడ అసన్సోల్ లోని ఓ క్రికెట్ అకాడమీలో చేరాడు. ఇది ఆకాష్ జీవితాన్ని మలుపుతిప్పిన ఘటన. ఖేప్ క్రికెట్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ లో కనబరిచిన ప్రతిభ కారణంగా దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా బౌలింగ్ లో చెలరేగడంతో.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ డివిజన్ మ్యాచ్ ల్లో ఆడే ఛాన్స్ వచ్చింది. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో బెంగాల్ సీనియర్ టీమ్ డైరెక్టర్ జోయ్ దీప్ ముఖర్జీ దృష్టిలో పడ్డాడు. ఆకాష్ బౌలింగ్ వేస్తుంటే కీపర్ వికెట్ల వెనకాల 10 గజాల దూరంలో నిల్చోడం చూసి ముఖర్జీ ఆశ్చర్యపోయాడట.

దీంతో వెంటనే అతడిని సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రామ్ కు ఆకాష్ ను రిఫర్ చేశాడు. ఇది దీప్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్. వచ్చిన అవకాశానల్లా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిన ఈ యువ కెరటం 2019లో బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి, టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఓవరాల్ గా ఇప్పటి వరకు 29 మ్యాచ్ లు ఆడిన ఆకాష్ 103 వికెట్లు తీసి సత్తాచాటాడు. ఆకాష్ ప్రతిభను గుర్తించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని దక్కించుకుంది. ఈ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన అతడు 6 వికెట్లు పడగొట్టాడు.

కాగా.. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనధికార టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపాడు దీప్. మూడు మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టి, భారత్-ఏ టీమ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఫాస్ట్ బౌలర్ గా టీమిండియాకు ఉపయుక్తమైన బౌలర్ గా ఆకాష్ దీప్ పనికొస్తాడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కష్టాల కడలిని ఈదుతూ.. తాను కోరుకున్న లక్ష్యాన్ని సాధించిన ఆకాష్ దీప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: MS Dhoni: గౌరవం రాదు.. సంపాదించుకోవాలి! ధోని కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి