iDreamPost

వాళ్ల మాటల్ని అస్సలు పట్టించుకోను.. గిల్ షాకింగ్ కామెంట్స్!

  • Published Feb 22, 2024 | 8:43 AMUpdated Feb 22, 2024 | 8:43 AM

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ మంచి ఫామ్​లో ఉన్నాడు. ఇంగ్లండ్​తో సిరీస్​లో తొలి టెస్టులో తడబడినా ఆ తర్వాత పుంజుకున్నాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ మంచి ఫామ్​లో ఉన్నాడు. ఇంగ్లండ్​తో సిరీస్​లో తొలి టెస్టులో తడబడినా ఆ తర్వాత పుంజుకున్నాడు.

  • Published Feb 22, 2024 | 8:43 AMUpdated Feb 22, 2024 | 8:43 AM
వాళ్ల మాటల్ని అస్సలు పట్టించుకోను.. గిల్ షాకింగ్ కామెంట్స్!

భారత జట్టు టెస్టుల్లో క్రమంగా గాడిన పడుతోంది. వన్డేలు, టీ20ల్లో అదరగొడుతున్న టీమిండియా.. లాంగ్ ఫార్మాట్​లో కాస్త వెనుకపడింది. అయితే మళ్లీ టెస్టుల్లో తన హవా చూపిస్తోంది. ఇంగ్లండ్​తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్​లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లడమే దీనికి ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. ఇంగ్లీష్ టీమ్​ను భారత్ వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తు చేసింది. ఈ విజయాల వెనుక శుబ్​మన్ గిల్ లాంటి యంగ్ బ్యాటర్ కాంట్రిబ్యూషన్ కూడా ఎంతగానో ఉంది. ఇటీవల కాలంలో వన్డేలు, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తూ టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన గిల్.. టెస్టుల్లో మాత్రం దారుణంగా ఫెయిల​వుతున్నాడు. ఇంగ్లండ్​తో తొలి టెస్టులోనూ విఫలమవడంతో అతడ్ని టీమ్​లో నుంచి తీసేయాలనే డిమాండ్లు పెరిగాయి. కానీ వరుసగా సూపర్బ్ నాక్స్​తో అతడు ఫామ్​ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో గిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్ల మాటల్ని తాను అస్సలు పట్టించుకోనని అన్నాడు.

ఇంగ్లండ్​తో సిరీస్​లోని తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్​లో 23 పరుగులు చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్​లో గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లోనూ 34 పరుగులకే పెవిలియన్​కు చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత పుంజుకొని రెండో ఇన్నింగ్స్​లో 104 పరుగులు చేశాడు. రాజ్​కోట్​ ఆతిథ్యం ఇచ్చిన మూడో టెస్టులోనూ 91 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడాడు గిల్. ఈ నేపథ్యంలో అతడు తన బ్యాటింగ్​పై రియాక్ట్ అయ్యాడు. ఫామ్​ను అందుకునేందుకు టెక్నికల్​గా తాను పెద్దగా మార్పులేమీ చేయలేదని అన్నాడు. తన మీద తాను పెట్టుకున్న అంచనాల ఒత్తిడిని తట్టుకోవడమే ఇంపార్టెంట్ అని చెప్పాడు. బయటి వాళ్లు ఎవ్వరు ఏమన్నా తానేమీ పట్టించుకోనని తెలిపాడు. దేశం కోసం, టీమ్ కోసం ఎలా ఆడాలనే దాని మీద ప్రతి ఒక్కరికీ ఎక్స్​పెక్టేషన్స్ ఉంటాయన్నాడు యంగ్ బ్యాటర్.

I don't care what they say!

టీమ్ కోసం ఎలా ఆడాలనే విషయంలో తనపై తాను కొన్ని అంచనాలు పెట్టుకున్నానని గిల్ చెప్పుకొచ్చాడు. కానీ ఆ ఎక్స్​పెక్టేషన్స్​ను అందుకోలేనందుకు నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు. అయితే తన దృక్పథంలో ఎలాంటి మార్పు లేదన్నాడు. ఫెయిల్యూర్స్​ను మరిచిపోయి ఎంత త్వరగా నెక్స్ట్‌ ఛాలెంజ్​కు రెడీ అవుతామనేదే ముఖ్యమని గిల్ స్పష్టం చేశాడు. బిగ్ ప్లేయర్, యావరేజ్ ప్లేయర్​కు మధ్య తేడా ఇదేనని వివరించాడు. ఇప్పటికీ తన ఎక్స్​పెక్టేషన్స్​లో ఎలాంటి మార్పు లేదని వ్యాఖ్యానించాడు. కాగా, ఇంతకుముందు వరకు టెస్టుల్లోనూ ఓపెనింగ్ పొజిషన్​లో ఆడుతూ వచ్చిన గిల్.. యశస్వి జైస్వాల్ టీమ్​లోకి ఎంట్రీ ఇవ్వడం, ఓపెనర్​గా సక్సెస్ అవడంతో మూడో స్థానానికి మారాల్సి వచ్చింది. అయితే ఆ ప్లేసులో అడ్జస్ట్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్నా.. ఇప్పుడు మళ్లీ ఫామ్ అందుకోవడంతో ఈజీగా రన్స్ చేస్తున్నాడు. మరి.. బయటి వాళ్లు ఏమన్నా పట్టించుకోనంటూ గిల్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఇంగ్లండ్​తో నాలుగో టెస్ట్.. ఒక్క మార్పుతో బరిలోకి భారత్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి