iDreamPost

ఇంగ్లండ్​తో నాలుగో టెస్ట్.. ఒక్క మార్పుతో బరిలోకి భారత్!

  • Published Feb 22, 2024 | 8:04 AMUpdated Feb 22, 2024 | 8:04 AM

ఇంగ్లండ్​తో నాలుగో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది భారత్. సిరీస్​లో ఈ మ్యాచ్​ డిసైడర్​గా మారడంతో రెండు టీమ్స్ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.

ఇంగ్లండ్​తో నాలుగో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది భారత్. సిరీస్​లో ఈ మ్యాచ్​ డిసైడర్​గా మారడంతో రెండు టీమ్స్ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.

  • Published Feb 22, 2024 | 8:04 AMUpdated Feb 22, 2024 | 8:04 AM
ఇంగ్లండ్​తో నాలుగో టెస్ట్.. ఒక్క మార్పుతో బరిలోకి భారత్!

భారత్-ఇంగ్లండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు అంతా రెడీ అయిపోయింది. ఈ రెండు టీమ్స్ మధ్య శుక్రవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ సిరీస్​లో డిసైడర్​గా మారింది. ఇప్పటికే టీమిండియా 2-1తో సిరీస్​లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఇక్కడే సిరీస్​ను పట్టేయాలని రోహిత్ సేన చూస్తోంది. పర్యాటక ఇంగ్లండ్​కు ఇది చావోరేవో లాంటి మ్యాచ్. రాంచీలో గెలిస్తే ఆ జట్టు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే ఎలాగైనా నాలుగో టెస్టులో విజయఢంకా మోగించాలని స్టోక్స్ సేన భావిస్తోంది. కానీ గత రెండు మ్యాచుల్లో భారత ప్లేయర్ల ఆటతీరు, వాళ్లు చూపించిన దూకుడు, కాన్ఫిడెన్స్ చూస్తుంటే సిరీస్ డిసైడింగ్ మ్యాచ్​లోనూ ఇంగ్లండ్​ను మడతపెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

రాంచీ టెస్టులో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగనుందని తెలుస్తోంది. సిరీస్​లోని తొలి మూడు మ్యాచుల్లో అదరగొట్టిన పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో రెస్ట్ ఇవ్వనున్నారు. అలాగే గాయం కారణంగా వైజాగ్, రాజ్​కోట్ టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ నాలుగో టెస్టుతో తిరిగి టీమ్​లోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇంజ్యురీ నుంచి అతడు పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్​కూ అతడ్ని దూరంగా ఉంచారు. దీంతో రాంచీ టెస్టులో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగనుంది. ఓపెనింగ్ బాధ్యతల్ని రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మోస్తారు. ఫస్ట్ డౌన్​లో శుబ్​మన్ గిల్ బరిలోకి దిగుతాడు. మిడిలార్డర్​ను రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా ముందుండి నడిపించనున్నారు. లోయరార్డర్​లో ధృవ్ జురెల్ బ్యాటింగ్​కు దిగుతాడు. స్పిన్​ ఆల్​రౌండర్​గా జడేజాతో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఉండనే ఉన్నాడు. వీళ్లతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు.

This is the playing eleven!

భారత పేస్ విభాగాన్ని హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపించనున్నాడు. రాంచీ టెస్టులో సిరాజ్​కు తోడుగా మరో పేసర్​గా ముఖేష్​ కుమార్ టీమ్​లోకి రానున్నాడు. బుమ్రా స్థానంలో అతడ్ని జట్టులోకి తీసుకోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. అయితే రాంచీ పిచ్ సిచ్యువేషన్​ను బట్టి ప్లేయింగ్ ఎలెవన్​ ఎలా ఉండాలో టాస్​కు ముందు డిసైడ్ అవుతారు. ఒకవేళ వికెట్ స్పిన్​కు బాగా సహకరిస్తుందని భావిస్తే బుమ్రా ప్లేసులో స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్​ను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఈ సిరీస్​లోని వికెట్లు పూర్తిగా స్పిన్​కు సహకరించిన దాఖలాల్లేవు. కాబట్టి ముఖేష్ టీమ్​లోకి రావడం పక్కా అని తెలుస్తోంది. కాగా, మూడో టెస్టులో చోటు దక్కకపోవడంతో ముఖేష్​ను రంజీల్లో ఆడమని బీసీసీఐ సూచించింది. రంజీ మ్యాచ్ ఆడిన అతడు ఒక ఇన్నింగ్స్​లో 6, మరో ఇన్నింగ్స్​లో 4 వికెట్లతో చెలరేగాడు. రాంచీ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో తిరిగి ముఖేష్​కు పిలుపొచ్చింది. మరి.. నాలుగో టెస్టులో భారత జట్టులో ఇంకేమైనా మార్పులు ఉంటాయని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్/ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్.

ఇదీ చదవండి: విధ్వంసానికి సెహ్వాగ్‌, గేల్‌ సిద్ధం! తొలి మ్యాచ్‌లో ముంబైతో తెలంగాణ ఢీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి