Nidhan
టీమిండియా యంగ్ క్రికెటర్స్‌లో టాలెంటెడ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు శ్రేయస్ అయ్యర్. సాలిడ్ డిఫెన్స్‌తో పాటు అద్భుతమైన షాట్ మేకింగ్‌తో ఫ్యూచర్ బ్యాటింగ్ స్టార్‌గా గుర్తింపు సంపాదించాడు. అలాంటోడు అవనసర వివాదంలో చిక్కుకొని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు.
టీమిండియా యంగ్ క్రికెటర్స్‌లో టాలెంటెడ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు శ్రేయస్ అయ్యర్. సాలిడ్ డిఫెన్స్‌తో పాటు అద్భుతమైన షాట్ మేకింగ్‌తో ఫ్యూచర్ బ్యాటింగ్ స్టార్‌గా గుర్తింపు సంపాదించాడు. అలాంటోడు అవనసర వివాదంలో చిక్కుకొని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు.
Nidhan
ప్రపంచ క్రికెట్లో మోస్ట్ పవర్ఫుల్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) హవా నడిపిస్తోంది. మన బోర్డుతో పెట్టుకునేందుకు అందరూ భయపడతారు. ఐసీసీలోనూ బీసీసీఐ ఏం చెబితే అదే నడుస్తుందని మాజీ క్రికెటర్లు చాలా మార్లు చెప్పడం గమనార్హం. అలాంటి బోర్డుతో పెట్టుకొని లేనిపోని చిక్కులు తెచ్చుకున్నాడు శ్రేయస్ అయ్యర్. స్టైలిష్ బ్యాటింగ్‌తో ప్రస్తుత భారత జట్టులోని యంగ్‌స్టర్స్‌లో స్పెషల్ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నాడతను. అందుకు తగ్గట్లే అతడికి వరుస ఛాన్సులు ఇస్తూ టీమ్ మేనేజ్మెంట్ కూడా ప్రోత్సహించింది. కానీ అయ్యర్ మాత్రం బీసీసీఐ ఆదేశాలను లెక్కచేయలేదు. తమ మాట వినకపోవడంతో బోర్డు తనదైన రూట్లోనే వెళ్లి అతడికి ఝలక్ ఇచ్చింది. దీంతో అయ్యర్ దిగిరాక తప్పలేదు.
రంజీ ట్రోఫీ-2024లో ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. భారత క్రికెట్ బోర్డు ఆదేశాలకు భయపడిన అయ్యర్.. ఎందుకొచ్చిన తంటా అనుకొని తిరిగి డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతున్నాడని టాక్. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో సరిగ్గా రాణించకపోవడంతో భారత జట్టులో అయ్యర్ చోటు కోల్పోయాడు. దీంతో అతడ్ని వెళ్లి రంజీల్లో ఆడాల్సిందిగా బోర్డు సూచించింది. కానీ గాయం సాకు చూపించి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు అయ్యర్. ఈ విషయంపై సీరియస్ అయిన బీసీసీఐ అతడి కాంట్రాక్ట్ రద్దు చేసేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ ఆఖరికి అయ్యర్ దగ్గరకు కూడా చేరిందట. దీంతో కెరీర్ క్లోజ్ అవుతుందని స్టైలిష్ బ్యాటర్ భయపడ్డాడట. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం.
అయ్యర్ ప్రాతినిధ్యం వహించే ముంబై జట్టు రంజీ ట్రోఫీ-2024లో సెమీఫైనల్‌కు క్వాలిఫై అయింది. దీంతో సెమీస్ మ్యాచ్‌లో ఆ టీమ్ తరఫున బరిలోకి దిగేందుకు అతడు రెడీ అవుతున్నాడని వినికిడి. ఈ వార్త తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. బీసీసీఐ దెబ్బకు అయ్యర్ దిగొచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. బోర్డుతో పెట్టుకుంటే కెరీర్ ముగిసే ప్రమాదం ఉండటంతో.. ఇష్టం లేకపోయినా రంజీల్లో ఆడేందుకు అతడు రెడీ అవుతున్నాడని అంటున్నారు. అయితే బీసీసీఐ చెప్పిన దాంట్లో తప్పు లేదని.. డొమెస్టిక్ క్రికెట్లో ఆడితే ఫామ్, ఫిట్నెస్ మెరుగవుతాయని చెబుతున్నారు. ఒక ఆటగాడు ఎంత ఫిట్‌గా ఉంటే టీమ్‌కు అంత మంచిదని.. రంజీల్లో రాణిస్తే ఆ కాన్ఫిడెన్స్ ఇండియాకు ఆడేటప్పుడు బూస్టప్‌గా ఉంటుందని అంటున్నారు. అయ్యర్‌లో ఎంతో ప్రతిభ ఉందని.. అనవసర కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అయ్యర్ రంజీల్లో రీఎంట్రీ ఇస్తున్నాడనే వార్తపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వైరల్‌గా ధోని అపాయింట్మెంట్ లెటర్.. మాహీ గురించి తెలియని ఎన్నో నిజాలు!
Shreyas Iyer will be playing in the Ranji Trophy Semi-Final for Mumbai. [Gaurav Gupta from TOI] pic.twitter.com/iOlmH6xx6F
— Johns. (@CricCrazyJohns) February 27, 2024