iDreamPost
android-app
ios-app

Rohit Sharma: దాదా, ధోని, కోహ్లీ రికార్డ్స్‌ గల్లంతు! టెస్ట్‌ కెప్టెన్‌గా రోహిత్‌ కొత్త చరిత్ర..

  • Published Feb 19, 2024 | 2:28 PM Updated Updated Feb 19, 2024 | 2:31 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతడి దెబ్బకు గంగూలీ, ధోని, కోహ్లీల రికార్డులు గల్లంతయ్యాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతడి దెబ్బకు గంగూలీ, ధోని, కోహ్లీల రికార్డులు గల్లంతయ్యాయి.

  • Published Feb 19, 2024 | 2:28 PMUpdated Feb 19, 2024 | 2:31 PM
Rohit Sharma: దాదా, ధోని, కోహ్లీ రికార్డ్స్‌ గల్లంతు! టెస్ట్‌ కెప్టెన్‌గా రోహిత్‌ కొత్త చరిత్ర..

వన్డేలు, టీ20ల్లో టీమిండియాను సూపర్బ్​గా నడిపిస్తున్న రోహిత్ శర్మ టెస్టుల్లో మాత్రం ఫెయిలవుతున్నాడు. బ్యాట్స్​మన్​గానూ, కెప్టెన్​గానూ లిమిటెడ్ ఓవర్స్​లో అతడికి తిరుగేలేదు. గతేడాది చూసుకుంటే.. భారత్​కు ఆసియా కప్​ను అందించాడు హిట్​మ్యాన్. అలాగే వన్డే వరల్డ్ కప్ ఫైనల్​కు తీసుకెళ్లాడు. కప్ చేజారినా మెగాటోర్నీలో అతడు ఆడిన ఆట, టీమ్​ను అద్భుతంగా నడిపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అయితే లాంగ్ ఫార్మాట్​లో మాత్రం అదే మ్యాజిక్​ను రిపీట్ చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు రోహిత్. ఎట్టకేలకు ఇంగ్లండ్​ సిరీస్​తో దాన్నీ ఛేంజ్ చేసేశాడు. బ్యాట్​తో పాటు కెప్టెన్​గానూ రాణించి టీమ్​ను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. రాజ్​కోట్​లో జరిగిన మూడో టెస్టులో సెంచరీతో చెలరేగిన హిట్​మ్యాన్.. ఈ మ్యాచ్​లో విజయంతో కెప్టెన్​గా చరిత్ర సృష్టించాడు. దాదా, ధోని, కోహ్లీల రికార్డులు గల్లంతయ్యేలా చేశాడు.

మూడో టెస్టులో ఇంగ్లండ్​ను ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది భారత్. టెస్టు క్రికెట్ హిస్టరీలో టీమిండియా 400 పరుగులకు పైగా తేడాతో విజయం సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్​లో భారత్​కు సారథ్యం వహించిన వారిలో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. వీరి హయంలో టీమ్​ ఎన్నో మర్చిపోలేని విజయాలు, సిరీస్​లు కైవసం చేసుకుంది. అయితే నాలుగొందల పైచిలుకు పరుగుల తేడాతో నెగ్గడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. రోహిత్ నాయకత్వంలోనే మొదటిసారి ఈ ఫీట్​ను టీమిండియా నమోదు చేసింది. తాజా గెలుపుతో హిట్​మ్యాన్ మరో అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు. వన్డేలు, టెస్టుల్లో భారత జట్టుకు అత్యంత భారీ విజయాలను అందించిన కెప్టెన్​గానూ రోహిత్ నిలిచాడు. టెస్టుల్లో 400 పరుగులకు పైగా తేడాతో, వన్డేల్లో 300 పరుగులకు పైగా తేడాతో టీమిండియా విజయం సాధించిన మ్యాచుల్లో హిట్​మ్యాన్ టీమ్​ను లీడ్ చేశాడు. ఇది ఇంతకుముందు ఏ కెప్టెన్​కూ సాధ్యం కాలేదు.

ఇంగ్లండ్​తో రాజ్​కోట్ మ్యాచ్​కు ముందు టెస్టు క్రికెట్​లో భారత్ అతిపెద్ద విజయంగా న్యూజిలాండ్​తో మ్యాచ్​నే చెప్పాలి. ఆ టీమ్​పై 372 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే తాజాగా మూడో టెస్టులో ఇంగ్లీష్ టీమ్​ను 434 పరుగుల తేడాతో చిత్తు చేయడంతో ఆ రికార్డు కనుమరుగైంది. అలాగే వన్డే క్రికెట్​లో శ్రీలంకపై 317 పరుగుల భారీ తేడాతో మన టీమ్ విక్టరీ కొట్టింది. గతేడాది జనవరి నెలలో తిరువనంతపురంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియాను హిట్​మ్యాన్ కెప్టెన్​గా ముందుండి లీడ్ చేయడం విశేషం. ఇలా అత్యధిక పరుగుల తేడాతో భారత్​కు విజయాలు అందించిన సారథిగా చరిత్ర సృష్టించిన రోహిత్.. కోహ్లీ, ధోని, గంగూలీని అధిగమించాడు. అలాగే టెస్టు క్రికెట్​లో హిట్​మ్యాన్ సెంచరీ చేసిన అన్ని మ్యాచుల్లోనూ మన జట్టు విజయం సాధించడం మరో విశేషం. లాంగ్ ఫార్మాట్​లో అతడు ఇప్పటిదాకా 11 సెంచరీలు బాదగా.. అన్ని మ్యాచుల్లోనూ భారత్ విజయకేతనం ఎగురవేసింది. మరి.. భారీ విజయాలతో దాదా, ధోని, కోహ్లీని రోహిత్ వెనక్కి నెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Ravindra Jadeja: మూడో టెస్ట్‌లో పిచ్‌కు ముద్దు పెట్టిన జడేజా! ఎందుకిలా చేశాడంటే..?