Nidhan
రాంచీ టెస్టులో రోహిత్ సేన అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గెలుపు ఆశలు అడుగంటిన మ్యాచ్‌లో పట్టుదలతో ఆడి గ్రాండ్ విక్టరీ కొట్టింది.
రాంచీ టెస్టులో రోహిత్ సేన అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గెలుపు ఆశలు అడుగంటిన మ్యాచ్‌లో పట్టుదలతో ఆడి గ్రాండ్ విక్టరీ కొట్టింది.
Nidhan
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు అందుబాటులో లేరు. ఇంటర్నేషనల్ లెవల్లో మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో లేడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లూ దూరమయ్యారు. సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రజత్ పాటిదార్, ఆకాశ్ దీప్ రూపంలో నలుగురు డెబ్యూటెంట్స్ జట్టులో ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్‌కు టెస్టుల్లో అంతగా అనుభవం లేదు. ఎదురుగా ఉన్నది బజ్‌బాల్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనే పలకరించిన ఓటమి. దీంతో భారత జట్టు పనైపోయింది అంటూ విమర్శలు వినిపించాయి. రోహిత్ శర్మను టీమ్‌లో నుంచి తీసేయండి, అతడు కెప్టెన్సీకి పనికి రాడనే కామెంట్స్ వచ్చాయి. అయితే కట్ చేస్తే.. సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది టీమిండియా. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను పట్టేసింది.
రాంచీ టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్‌ను చిత్తు చేసింది. ఈ విక్టరీతో సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. కోహ్లీ, రాహుల్ అండ లేకపోయినా.. బుమ్రా, షమి దూరమైనా టీమ్‌లో ఉన్న యంగ్‌స్టర్స్ అండతో బజ్‌బాల్ బెండు తీశాడు రోహిత్. జైస్వాల్, గిల్, జురెల్, ఆకాశ్ దీప్, సర్ఫరాజ్ లాంటి యువ క్రికెటర్ల నుంచి తనకు ఏం కావాలో అది రాబట్టాడు. టీమ్ అవసరాలకు తగ్గట్లు వారి రోల్స్‌ను ఫిక్స్ చేశాడు. సిచ్యువేషన్‌కు తగ్గట్లు ఎలా ఆడాలో గైడ్ చేసి రిజల్ట్ రాబట్టాడు. ఉప్పల్ టెస్టు ఓటమి తర్వాత టీమ్‌ను హిట్‌మ్యాన్ నడిపించిన తీరు.. వరుసగా మూడు మ్యాచుల్లో జట్టును గెలిపించిన విధానం, సిరీస్‌ను అందించిన దానికి ఎంత మెచ్చుకున్నా తక్కువే. జైస్వాల్‌తో కలసి ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమ్‌కు మంచి స్టార్ట్‌లు అందించాడు రోహిత్. తాను బ్యాటర్‌గా రాణిస్తూ యువకుల్లో స్ఫూర్తిని నింపాడు. పరుగులు చేయాలనే కసిని, తపనను పెంచాడు.
బెన్ స్టోక్స్ బౌలింగ్ ఛేంజెస్‌తో ఎంత ఇబ్బంది పెట్టినా, కఠినమైన పిచ్ మీద పరుగులు రావడం కష్టమైనా యంగ్‌స్టర్స్ అండతో రాంచీలో విజయాన్ని కట్టబెట్టాడు రోహిత్. జైస్వాల్ లాంటి వారిని ఓ ఎండ్‌లో నిలబడి గైడ్ చేశాడు హిట్‌మ్యాన్. డ్రెస్సింగ్ రూమ్ నుంచి అవసరమైనప్పుడల్లా సూచనలను పలు విధాలుగా బ్యాటర్ల దగ్గరకు చేరువయ్యేలా చేశాడు. హిట్టింగ్ వద్దని క్రీజులో నిలబడితే రన్స్ అవే వస్తాయని ఈ పిచ్ మీద ఎలా ఆడాలో జైస్వాల్, గిల్, జురెల్‌కు అర్థం అయ్యేలా వివరించాడు. ఇది వర్కౌట్ అయింది. వాళ్లు పేషెన్స్‌తో ఆడి టీమ్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఈ సిరీస్ మొత్తం బౌలింగ్ ఛేంజెస్, డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలోనూ రోహిత్ మార్క్ కనిపించింది.
బజ్‌బాల్ పేరుతో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు రోహిత్ అటాకింగ్ మంత్రాన్ని ఫాలో అయ్యాడు. అశ్విన్, జడేజా, బుమ్రాతో వికెట్లను టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేయించాడు. రన్స్ లీకైనా భయపడొద్దని షాట్లు కొట్టే క్రమంలో వాళ్లే ఔట్ అవుతారని నచ్చజెప్పాడు. ఇది బాగా వర్కౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాటర్లు మంచి స్టార్ట్స్ దొరికినా హిట్టింగ్‌కు వెళ్లి వికెట్లు అప్పగించుకున్నారు. నాలుగో టెస్టులో బుమ్రా లేకపోయినా కొత్త పేసర్ ఆకాశ్ దీప్‌పై నమ్మకం ఉంచి బరిలోకి దించాడు. అది ఫలించి ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఈ సిరీస్ హిట్‌మ్యాన్‌కు ఓ మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందనే చెప్పాలి.
రోహిత్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. టాప్ ప్లేయర్స్ లేకపోయినా, మొదటి టెస్టులో ఓటమితో సిరీస్‌లో వెనుకపడినా, బజ్‌బాల్ భయపెట్టినా టీమ్‌కు సిరీస్ అందించావని.. నువ్వు సూపర్ రోహిత్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇది అసలైన విజయమని.. కెప్టెన్‌గా రోహిత్ ఇప్పుడు గెలిచాడని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు లేకపోయినా, ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా జట్టును గెలిపించే సత్తా తనలో ఉందని అతడు ప్రూవ్ చేశాడని అంటున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య టీమ్‌ను గెలిపించడం హిట్‌మ్యాన్ ఒక్కడి వల్లే సాధ్యమని చెబుతున్నారు. మరి.. రోహిత్ కెప్టెన్సీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నాలుగో టెస్టులో భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!
– India 0-1 down in this series.
– No Kohli.
– No Rahul.
– No Shami.
– No Shreyas Iyer.
– Lots of outside noise
– 4 debutants in series
– India comeback in 2nd Test.
– India won the Test series by 3-1*.– Team India won one of the greatest Test series under Rohit Sharma…!!!! 🇮🇳 pic.twitter.com/yWDeDQ7Yvf
— CricketMAN2 (@ImTanujSingh) February 26, 2024