iDreamPost
android-app
ios-app

IND vs ENG: పుజారా ఫ్యూచర్​పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. ఇంత మాట అనేశాడేంటి!

  • Published Feb 13, 2024 | 10:35 AM Updated Updated Feb 13, 2024 | 10:35 AM

క్రికెట్​కు టీమిండియా అందించిన గొప్ప బ్యాటర్లలో ఛటేశ్వర్ పుజారా ఒకడు. సాలిడ్ డిఫెన్స్​తో ద్రవిడ్​ను తలపించే ఈ నయా వాల్.. స్ట్రయిక్ రొటేషన్, ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లడంలో లక్ష్మణ్​ను గుర్తుచేస్తాడు. అలాంటోడిపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

క్రికెట్​కు టీమిండియా అందించిన గొప్ప బ్యాటర్లలో ఛటేశ్వర్ పుజారా ఒకడు. సాలిడ్ డిఫెన్స్​తో ద్రవిడ్​ను తలపించే ఈ నయా వాల్.. స్ట్రయిక్ రొటేషన్, ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లడంలో లక్ష్మణ్​ను గుర్తుచేస్తాడు. అలాంటోడిపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Feb 13, 2024 | 10:35 AMUpdated Feb 13, 2024 | 10:35 AM
IND vs ENG: పుజారా ఫ్యూచర్​పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. ఇంత మాట అనేశాడేంటి!

క్రికెట్​కు భారత్ అందించిన గొప్ప బ్యాటర్లలో ఛటేశ్వర్ పుజారా ఒకడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టెస్ట్ స్పెషలిస్ట్ ఎన్నో మ్యాచుల్లో సింగిల్ హ్యాండ్​తో టీమిండియాకు విక్టరీలు అందించాడు. బ్యాటింగ్ యూనిట్ పేకమేడలా కొలాప్స్ అయిన చాలా సందర్భాల్లో అడ్డుగోడలా నిలబడి కాపాడాడు. అలాంటోడు ఈ మధ్య టీమ్​కు దూరమయ్యాడు. ఫామ్​లో లేకపోవడం, యంగ్​స్టర్స్ దూసుకురావడంతో అతడ్ని పక్కన పెట్టారు సెలక్టర్లు. అయితే రంజీల్లో వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు పుజారా. బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ నాక్స్​తో చెలరేగిపోతున్నాడు. అయినా అతడ్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంగ్లండ్​తో సిరీస్​లో బ్యాటర్లు ఫెయిలైనా.. పుజారాను మాత్రం జట్టులోకి తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో అతడి గురించి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పుజారా పిలుపు కోసం తాము ఎదురు చూస్తున్నామని అశ్విన్ అన్నాడు. గతంలో అతడు తమను ఇంటికి పిలిచాడని.. ఈసారి కూడా పిలుస్తాడేమోనని వెయిటింగ్ అని చెప్పాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్​లోని మూడో మ్యాచ్​కు రాజ్​కోట్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఇది పుజారాకు హోమ్ గ్రౌండ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అతడి గురించి అశ్విన్ కామెంట్స్ చేశాడు. ‘భారత ఆటగాళ్లంతా తర్వాతి మ్యాచ్​కు వేదికైన రాజ్​కోట్​లో కలుసుకుంటాం. ఇది పుజారా హోమ్ గ్రౌండ్. 100కు పైగా టెస్టులు ఆడిన లెజెండ్ అతను. అతడి ఊళ్లో మేం ఆడబోతున్నాం. జడేజాకు కూడా ఇదే సొంత గ్రౌండ్. కానీ అతడు జామ్​నగర్​లో ఉంటాడు. కాబట్టి పుజారా మమల్ని అందర్నీ వాళ్ల ఇంటికి డిన్నర్​కు పిలుస్తాడేమోనని ఎదురు చూస్తున్నాం’ అని తన యూట్యూబ్ ఛానల్​లో అశ్విన్ చెప్పుకొచ్చాడు.

2016లో ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్ టైమ్​లో రాజ్​కోట్​లోని తన ఇంటికి భారత క్రికెటర్లను పుజారా ఆహ్వానించాడు. అక్కడ వారి కోసం డిన్నర్ అరేంజ్ చేశాడు. అందుకే ఈసారి కూడా అతడు తమను పిలుస్తాడని అశ్విన్ అన్నాడు. అయితే భారత జట్టులో చోటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న నయా వాల్.. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు టీమిండియాను ఇంటికి ఆహ్వానించడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. అశ్విన్ ఇంత మాట అనేశాడేంటి.. పుజారా పిలుస్తాడేమోనని డౌట్ ఎందుకు? అంటున్నారు. అతడు అందుబాటులో ఉంటే తప్పక ఆహ్వానిస్తాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, వైజాగ్ టెస్టు తర్వాత దొరికిన భారీ గ్యాప్​ను పూర్తిగా వాడుకుంటున్నారు భారత క్రికెటర్లు. ఇళ్ల వద్ద ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. మూడో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న రాజ్​కోట్​కు త్వరలో వెళ్లనున్నారు. మరి.. పుజారా పిలుపు కోసం ఎదురు చూస్తున్నామంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ట్రోలర్స్​కు ఇచ్చిపడేసిన బుమ్రా భార్య.. అలా అనడానికి సిగ్గుండాలంటూ..!