Nidhan
ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది భారత్. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఘనవిజయం సాధించడానికి గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది భారత్. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఘనవిజయం సాధించడానికి గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
అనుకున్నదే జరిగింది. మొదటి రోజు నుంచి ఫుల్ డామినేషన్ చూపించిన భారత్.. రెండో రోజు దాన్ని కొనసాగించి, మూడో రోజు మధ్యాహ్నానికే ఆటను ముగించింది. భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆ టీమ్ ఏకంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కనీసం ఫైట్‌బ్యాక్ అనేది లేకుండా రోహిత్ సేన ముందు తలొగ్గింది. మ్యాచ్‌లో ఏ దశలోనూ ఆ టీమ్ పోరాడలేదు. మూడో రోజు భారత్‌ను 477 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లీష్ టీమ్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో పరాభవం తప్పలేదు. ఈ విక్టరీతో సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది భారత్. ఈ నేపథ్యంలో ఐదో టెస్టులో మన టీమ్ విజయానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
1. స్పిన్ బౌలింగ్
ధర్మశాల టెస్టులో టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెలరేగిపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో వీళ్లిద్దరూ కలసి 9 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈ జోడీ 7 వికెట్లు తీసింది. రవీంద్ర జడేజా కూడా 2 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి పతనంలో తనదైన పాత్ర పోషించాడు. స్పిన్నర్లు విజృంభించడం, ఒక్క బ్యాటర్‌ను కూడా క్రీజులో కుదురుకోకుండా చేయడం, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేయడం వల్లే భారత్ సునాయాసంగా నెగ్గింది.
2. బ్యాటింగ్
ఐదో టెస్టులో భారత్ ఒకేసారి బ్యాటింగ్‌కు దిగింది. బౌలర్లు విజృంభించడం, బ్యాటర్లు కూడా సూపర్బ్‌గా రాణించడంతో ఇంకోసారి బ్యాట్ పట్టాల్సిన అవసరం రాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 పరుగులు చేసిందంటే దానికి కెప్టెన్ రోహిత్ శర్మ (103), శుబ్‌మన్ గిల్ (110) బాదిన సెంచరీలే కారణం. అయితే వీరితో పాటు యశస్వి జైస్వాల్ (57), దేవ్‌దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) ఇన్నింగ్స్‌ను కూడా తక్కువ చేయడానికి లేదు. రోహిత్-గిల్ తర్వాత పడిక్కల్-సర్ఫరాజ్ పార్ట్నర్షిప్ మ్యాచ్‌లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా చెప్పొచ్చు.
3. రోహిత్-గిల్ సెంచరీలు
నిల్చుంటే పరుగులు వచ్చే పిచ్ మీద అనవసర అటాక్‌కు వెళ్లి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇందులో కుల్దీప్, అశ్విన్ స్పిన్ మ్యాజిక్‌ను తక్కువ చేయడానికి లేదు. అదే టైమ్‌లో రోహిత్-గిల్ సెంచరీల గురించి మాట్లాడుకోవాలి. ధర్మశాల పిచ్‌పై పరుగులు ఈజీగా వస్తాయని వీళ్లు ప్రూవ్ చేశారు. వీళ్లు ఎప్పుడైతే సెంచరీలు చేశారో అప్పుడే భారత్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్ల ముఖాలు వాడిపోయాయి. ఓటమి భయం అప్పుడే పట్టేసుకుంది. కాబట్టి మ్యాచ్ గెలుపులో రోహిత్-గిల్ పార్ట్నర్షిప్, సెంచరీలు ప్రధాన కారణమని చెప్పొచ్చు.
4. కుల్దీప్-అశ్విన్ జోడీ
బ్యాటింగ్‌లో రోహిత్-గిల్ జోడీలాగే బౌలింగ్‌లో కుల్దీప్-అశ్విన్ మ్యాజిక్ చేశారు. వీళ్లిద్దరూ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తీసిన వికెట్లు 16. మొత్తం 20 వికెట్లలో వీళ్లే 90 శాతానికి పైగా పడగొట్టేశారు. ఒక ఎండ్ నుంచి అశ్విన్, మరో ఎండ్ నుంచి కుల్దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే పరుగులు రాక, వికెట్లు పడుతుంటే ఇంగ్లండ్ క్యాంపెయిన్ షాకైంది. ఇదేం బౌలింగ్ అంటూ ఆశ్చర్యపోయింది. ఐదో టెస్టు సక్సెస్‌లో ఈ ఇద్దరు స్పిన్ మాంత్రికులకు ఎక్కువ శాతం క్రెడిట్ ఇవ్వాలి.
5. బెన్ స్టోక్స్ తప్పుడు నిర్ణయం
ధర్మశాల టెస్టులో టాస్ నెగ్గిన సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఓ తప్పు చేశాడు. అతడు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అదే ఆ జట్టుకు శాపంగా మారింది. ఇంగ్లీష్ టీమ్ 218 పరుగులకే కుప్పకూలడం, ఆ తర్వాత భారత్ 477 పరుగులు చేయడం తెలిసిందే. పిచ్ నుంచి స్పిన్‌కు మద్దతు ఉందని గ్రహించి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటే బాగుండేది. కానీ అతడు బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అది రోహిత్ సేనకు కలిసొచ్చింది. మరి.. ధర్మశాల టెస్టులో టీమిండియా విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: కుర్రాళ్లను గెలికిన బెయిర్ స్టో! ఒక్క మాటతో పరువుతీసిన గిల్
INDIA WON THE SERIES 4-1 AGAINST BAZBALL.
– A historic win for Rohit & his boys. 🇮🇳 pic.twitter.com/w2vh4WK2IN
— Johns. (@CricCrazyJohns) March 9, 2024