iDreamPost

మ్యాచ్​లు ఎలా ఫినిష్ చేయాలో అతడ్ని చూసి నేర్చుకుంటున్నా: తిలక్ వర్మ

  • Author singhj Published - 03:31 PM, Sun - 26 November 23

మ్యాచ్​లు ఫినిష్ చేయడంపై తాను ఫోకస్ చేస్తున్నానని టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఈ విషయంలో ఒక ప్లేయర్​ను చూసి తాను నేర్చుకుంటున్నానని చెప్పాడు.

మ్యాచ్​లు ఫినిష్ చేయడంపై తాను ఫోకస్ చేస్తున్నానని టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఈ విషయంలో ఒక ప్లేయర్​ను చూసి తాను నేర్చుకుంటున్నానని చెప్పాడు.

  • Author singhj Published - 03:31 PM, Sun - 26 November 23
మ్యాచ్​లు ఎలా ఫినిష్ చేయాలో అతడ్ని చూసి నేర్చుకుంటున్నా: తిలక్ వర్మ

క్రికెట్​లో మ్యాచ్​లు ఫినిష్ చేయడం అనేది ఓ కళ. వన్డేలు, టెస్టులు, టీ20లు.. ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ ముగించడం చాలా ముఖ్యం. బౌలింగ్​లో ఓపెనింగ్ స్పెల్స్ వేసేవాళ్లు, మిడిల్ ఓవర్లలో కట్టడి చేసేవారు ఉంటే సరిపోదు. డెత్ ఓవర్‌‌ స్పెషలిస్టులు కూడా ఉండాలి. అప్పుడే తక్కువ టార్గెట్​లను కాపాడుకోవచ్చు. అదే టైమ్​లో బ్యాటింగ్​లో బెస్ట్ ఫినిషర్స్ జట్టులో ఉండాలి. అప్పుడే లోయరార్డర్ సాయంతో భారీ స్కోర్లు సెట్ చేసేందుకు, ఛేజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫినిషర్ల విషయం ఎత్తగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీనే.

టాపార్డర్, మిడిలార్డర్ త్వరగా కుప్పకూలిపోతే బ్యాటింగ్ బాధ్యతను తన భుజాల మీద వేసుకునేవాడు మాహీ. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్​లను గెలిపించేవాడు. లోయరార్డర్ సాయంతో ఒక్కో రన్ చేస్తూ అసాధ్యమనుకున్న ఎన్నో మ్యాచుల్లో జట్టును విజయ తీరాలకు చేర్చాడు ధోని. భారత జట్టులో ధోని తర్వాత మ్యాచులను ముగించే రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచులను ఫినిష్ చేయడం ఈ మోడ్రన్ మాస్టర్​కు ఒక అలవాటుగా మారింది. ఛేజింగ్ టైమ్​లో మరింత పట్టుదలతో ఆడే కోహ్లీ.. చివరి వరకు ఉండి భారత్​కు విజయాలను అందిస్తున్నాడు. అందుకే అతడ్ని ఛేజింగ్ కింగ్ అని అంటుంటారు.

మూడో డౌన్​లో వచ్చే కోహ్లీ కంటే కూడా ఆరో డౌన్, ఏడో డౌన్​లో ఉండే బ్యాటర్లపై మ్యాచ్​లు ఫినిష్ చేసే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే హార్దిక్ పాండ్యాను ఈ రోల్ కోసం టీమ్ మేనేజ్​మెంట్ పుష్ చేస్తూ వస్తోంది. ఇందులో పాండ్యా బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు రిటైరైనా.. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ నుంచి వైదొలిగినా హార్దిక్ బ్యాటింగ్ ఆర్డర్​లో పైకి రావాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త ఫినిషర్​ను ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రింకూ సింగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే రూపంలో మిడిలార్డర్​లో మంచి యంగ్​స్టర్స్ ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

ఇప్పటికే వీళ్లు తమను తాము ప్రూవ్ చేసుకున్నా.. ఇంటర్నేషనల్ లెవల్లో మరింత నిలకడగా పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టీ20లో రింకూ సింగ్ ఆఖర్లో వచ్చి ఫుల్ టెన్షన్​లోనూ కూల్​గా మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. కానీ ఆ మ్యాచ్​లో హైదరాబాదీ తిలక్ మాత్రం త్వరగా ఔటయ్యాడు. చివరి వరకు ఉండి మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకుంటే అనవసరంగా భారీ షాట్​కు వెళ్లి వికెట్ సమర్పించుకున్నాడు. దీనిపై తాజాగా రియాక్ట్ అయ్యాడు తిలక్.

ఉత్కంఠగా సాగే టీ20ల్లో మ్యాచ్​లు ఎలా ఫినిష్ చేయాలనేది సహచర ప్లేయర్ రింకూ సింగ్ నుంచి నేర్చుకుంటున్నానని తిలక్ వర్మ అన్నాడు. వచ్చే మ్యాచ్​ల్లో పక్కాగా తానే మ్యాచ్​లు ఫినిష్ చేస్తానని మాటిచ్చాడు తిలక్. తన మీద ఎలాంటి ప్రెజర్ లేదన్నాడు. టీమ్​లో తనకు ఓ రోల్ ఉందని.. దాన్ని పోషిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తాను కొట్టగలిగే చోట బాల్​ దొరికితే బాదేస్తానని.. లేకపోతే స్ట్రయిక్ రొటేట్ చేస్తానన్నాడు తిలక్. మరి.. రింకూ నుంచి ఫినిషింగ్ పాఠాలు నేర్చుకుంటున్నానంటూ తిలక్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసీస్ పేసర్ బెరెన్​డార్ఫ్​ ఆసక్తికర వ్యాఖ్యలు.. అతడు భయపెడుతున్నాడంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి