iDreamPost

టీ20 సిరీస్ మధ్యలో ఎంట్రీ ఇస్తున్న విధ్వంసకర బ్యాటర్.. ఆసీస్​కు చుక్కలే!

  • Author singhj Published - 10:10 PM, Wed - 29 November 23

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ మధ్యలో ఒక భారత విధ్వంసకర బ్యాటర్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో కంగారూలకు ఇక చుక్కలేనని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ మధ్యలో ఒక భారత విధ్వంసకర బ్యాటర్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో కంగారూలకు ఇక చుక్కలేనని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు.

  • Author singhj Published - 10:10 PM, Wed - 29 November 23
టీ20 సిరీస్ మధ్యలో ఎంట్రీ ఇస్తున్న విధ్వంసకర బ్యాటర్.. ఆసీస్​కు చుక్కలే!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్​ రిజల్ట్​ను తేల్చేయాలని భావించిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్నంలో జరిగిన ఫస్ట్ టీ20లో నెగ్గిన భారత్.. తిరువనంతపురం ఆతిథ్యం ఇచ్చిన రెండో మ్యాచులోనూ గెలిచింది. దీంతో 2-0 లీడింగ్​లోకి దూసుకొచ్చిన మన టీమ్ మరో రెండు మ్యాచులు ఉండగానే సిరీస్​ను కైవసం చేసుకోవాలని అనుకుంది. కానీ మూడో టీ20లో మనకు ఆసీస్​ గట్టి షాక్ ఇచ్చింది. గువాహటిలోనే సిరీస్​ను దక్కించుకోవాలనుకున్న టీమిండియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది కంగారూ టీమ్. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన జట్టు.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 రన్స్ చేసింది.

మూడో టీ20లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (39), తిలక్ వర్మ (31 నాటౌట్) కూడా రాణించారు. ఛేదించాల్సిన స్కోరు భారీగా ఉండటంతో కంగారూలకు మరో ఓటమి తప్పదని.. సిరీస్​ భారత్​దేనని అంతా డిసైడయ్యారు. కానీ గ్లెన్ మ్యాక్స్​వెల్ (104 నాటౌట్) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 134 రన్స్​కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్​ను సింగిల్ హ్యాండ్​తో గెలిపించాడు మ్యాక్సీ. అతడికి మాథ్యూ వేడ్ (28 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అతడు ఏకంగా 30 రన్స్ ఇచ్చుకున్నాడు.

బౌలింగ్​ వేసి ఒకే ఓవర్​లో 30 రన్స్ ఇచ్చుకోవడంతో కసిగా బ్యాటింగ్ చేసిన మ్యాక్స్​వెల్ సెంచరీ బాదాడు. అతడి ఇన్నింగ్స్​లో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్​లో ఒంటికాలు మీద ఎక్కువగా వెయిట్​ను ట్రాన్స్​ఫర్ చేస్తూ నిలబడిన చోటు నుంచే భారీ షాట్లు కొట్టాడతను. వరల్డ్ కప్​లో ఆఫ్ఘానిస్థాన్​పై ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్​ను మరోమారు గుర్తుచేశాడు. సిరీస్​ను పోగొట్టుకోవద్దంటే గెలవాల్సిన మ్యాచ్​లో విజయం దక్కడంతో నాలుగో టీ20కి ముందు ఆసీస్ ఫుల్ జోష్​లో కనిపిస్తోంది. అయితే భారత జట్టుకూ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ మ్యాచ్​కు ఒక విధ్వంసకర బ్యాటర్ వచ్చేస్తున్నాడు.

ఆస్ట్రేలియాతో ఆడాల్సిన మిగిలిన రెండు టీ20ల కోసం భారత జట్టుతో చేరనున్నాడు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. రీసెంట్​గా ముగిసిన ప్రపంచ కప్​లో విధ్వంసక బ్యాటింగ్​తో అందర్నీ అలరించిన అయ్యర్ చేరికతో మన టీమ్ బ్యాటింగ్ యూనిట్ మరింత స్ట్రాంగ్​గా కనిపిస్తోంది. ఇప్పటికే సిరీస్​లో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది మన బ్యాటింగ్ విభాగం. ఇంక అయ్యర్ కూడా తోడైతే ఏ రేంజ్​లో విధ్వంసం ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. అయితే శ్రేయస్ కోసం హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ త్యాగం చేయక తప్పని పరిస్థితి. తిలక్ ప్లేసులో అయ్యర్ బ్యాటింగ్​కు దిగే అవకాశాలు ఉన్నాయి. మరి.. కంగారూలతో సిరీస్​ కోసం అయ్యర్ వస్తుండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బీసీసీఐ ఆఫర్​ను తిరస్కరించిన నెహ్రా! అహంకారంతో కాదు.. ఆలోచించే చేశాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి