Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా బ్యాటర్ల నుంచి బిగ్ ఇన్నింగ్స్ రాలేదని ఫ్యాన్స్ బాధపడుతూ వచ్చారు. అయితే ఒక్క ఇన్నింగ్స్‌తో వాళ్లను కేరింతలు కొట్టించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా బ్యాటర్ల నుంచి బిగ్ ఇన్నింగ్స్ రాలేదని ఫ్యాన్స్ బాధపడుతూ వచ్చారు. అయితే ఒక్క ఇన్నింగ్స్‌తో వాళ్లను కేరింతలు కొట్టించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా బ్యాటర్ల నుంచి బిగ్ ఇన్నింగ్స్ రాలేదని ఫ్యాన్స్ బాధపడుతూ వచ్చారు. అయితే ఒక్క ఇన్నింగ్స్‌తో వాళ్లను కేరింతలు కొట్టించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 ఫైట్‌లో తన విశ్వరూపం చూపించాడు హిట్‌మ్యాన్. ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లను ఊచకోత కోయడం మొదలుపెట్టాడు. 41 బంతుల్లోనే 7 బౌండరీలు, 8 సిక్సులతో 92 పరుగులు చేశాడు హిట్‌మ్యాన్. నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడతను.
కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రోహిత్.. ఏకంగా 6 రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌తో ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో 200 సిక్సుల్ని అతడు కంప్లీట్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో ఇన్ని సిక్సులు కొట్టిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 19 వేల పరుగుల మైల్‌స్టోన్‌ను దాటిన ఆటగాడిగానూ రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక బౌండరీలు కొట్టిన బ్యాటర్‌గా మరో రికార్డు నెలకొల్పాడు రోహిత్. అలాగే ఒక జట్టు మీద అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగానూ నిలిచాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు భారత సారథి. తద్వారా ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. అదే విధంగా టీమిండియా తరఫున టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డు క్రియేట్ చేశాడు.
Records of Rohit Sharma:
– Completed 200 sixes in T20is.
– Completed 19,000 runs.
– Leading boundary hitter in T20WC.
– Leading six hitter against an opponent.
– Fastest fifty in 2024 T20WC.
– 2nd Highest individual score for India in T20WC.THE RECORD BREAKER, THE HITMAN. 🚀 pic.twitter.com/Uvq54vBGy3
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2024