iDreamPost

IND vs AUS: అలా బౌలింగ్ చేయడానికి సూర్యనే కారణం.. అతడు చెప్పిన ఆ మాటతోనే..!

  • Author singhj Published - 01:28 PM, Mon - 4 December 23

ఆసీస్​తో ఆఖరి టీ20లో ఓడిపోయే మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడు యంగ్ పేసర్ అర్ష్​దీప్ సింగ్. అయితే తాను అలా బౌలింగ్ చేయడానికి కెప్టెన్ సూర్యకుమారే కారణమన్నాడు అర్ష్​దీప్.

ఆసీస్​తో ఆఖరి టీ20లో ఓడిపోయే మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడు యంగ్ పేసర్ అర్ష్​దీప్ సింగ్. అయితే తాను అలా బౌలింగ్ చేయడానికి కెప్టెన్ సూర్యకుమారే కారణమన్నాడు అర్ష్​దీప్.

  • Author singhj Published - 01:28 PM, Mon - 4 December 23
IND vs AUS: అలా బౌలింగ్ చేయడానికి సూర్యనే కారణం.. అతడు చెప్పిన ఆ మాటతోనే..!

టీమిండియా మరోమారు అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్​ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఐదో టీ20లో భారత్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో ముందు బ్యాటింగ్​కు దిగిన మన టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్​ (53), అక్షర్ పటేల్ (31), జితేష్ శర్మ (24) రాణించారు. ఒకదశలో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్​ను అయ్యర్ ఆదుకున్నాడు. జితేష్, అక్షర్​తో కలసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. గత మ్యాచ్​లో ఫెయిలైన అయ్యర్.. ఆఖరి టీ20లో మాత్రం సత్తా చాటాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అయ్యర్ లేకపోతే భారత్ 160 రన్స్ చేసేది కాదు. అతడు పట్టుదలతో బ్యాటింగ్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది.

ఎప్పుడూ బ్యాటింగ్​కు అనుకూలించే బెంగూళూరు పిచ్ ఐదో టీ20లో మాత్రం మందకొడిగా వ్యవహరించింది. ఈ ట్రిక్కీ పిచ్ పై బాల్ బ్యాట్ మీదకు ఆలస్యంగా వచ్చింది. దీంతో షాట్లు కొట్టేందుకు బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. రెండు ఇన్నింగ్స్​ల్లోనూ ఇలాగే జరిగింది. స్పిన్నర్లకు ఈ వికెట్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. దీన్ని యూజ్ చేసుకున్న భారత స్పిన్నర్లు ఆసీస్​ను 154 రన్స్​కు కట్టడి చేశారు. బెన్ మెక్​డార్మాట్ (54), ట్రావిస్ హెడ్ (28), మ్యాథ్యూ వేడ్ (22) రాణించినప్పటికీ తమ టీమ్​ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. మొదట్లో హెడ్ రెచ్చిపోతే.. మిడిల్ ఓవర్లలో డెర్మాట్ సత్తా చాటాడు. ఆఖర్లో వేడ్ మెరుపులు మెరిపించాడు. కానీ ఈ ముగ్గుర్నీ సరైన సమయంలో ఔట్ చేసిన టీమిండియా బౌలర్లు మ్యాచ్​ చేజారకుండా చూసుకున్నారు.

ఆసీస్ బ్యాటర్లు చెలరేగిన ప్రతిసారి భారత బౌలర్లు వికెట్లు తీస్తూ అడ్డుకున్నారు. క్రమం తప్పకుండా బ్రేక్ త్రూస్ ఇస్తూ అపోజిషన్ టీమ్​ను ఎక్కడా కుదురుకోనివ్వలేదు. అయితే మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. 20వ ఓవర్​లో ఆస్ట్రేలియా గెలుపునకు 10 పరుగులు కావాల్సి వచ్చింది. బౌలింగ్ వేయడానికి వచ్చిన అర్ష్​దీప్ సరైన ఫామ్​లో లేడు. క్రీజులో ఉన్న వేడ్ మ్యాచ్ ఫినిష్ చేయడంలో ఎక్స్​పర్ట్ అనేది తెలిసిందే. అంతకుముందు ఓవర్​లోనూ అతడు బౌండరీలు బాదాడు. దీంతో కంగారూ టీమ్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రిథమ్​లోకి వచ్చిన అర్ష్​దీప్ కసిగా బౌలింగ్ చేశాడు. 144 కిలోమీటర్ల వేగంతో బాల్స్ సంధిస్తూ వేడ్​కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో అతడు రాంగ్ షాట్ ఆడి ఔటయ్యాడు. ఆ తర్వాత వేసిన మూడు బాల్స్​కూ మూడు రన్స్ మాత్రమే ఇచ్చి గెలిపించాడు అర్ష్​దీప్ సింగ్.

భారత గెలుపులో కీలక పాత్ర పోషించిన అర్ష్​దీప్ మ్యాచ్ తర్వాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్​లో తన వల్లే టీమ్ ఓడిపోతోందని బాధపడ్డానని అన్నాడు. తొలి మూడు ఓవర్లలో భారీగా రన్స్ ఇచ్చుకోవడంతో టెన్షన్ పడ్డానని చెప్పాడు. అయితే లాస్ట్ ఓవర్ రూపంలో తనకు మరో ఛాన్స్ దక్కిందని.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండగా నిలబడటంతో బాగా బౌలింగ్ చేసి గెలుపులో కీలకపాత్ర పోషించానని తెలిపాడు. ‘నా మీద నమ్మకం ఉంచిన కెప్టెన్ సూర్యకుమార్, సపోర్ట్ స్టాఫ్​కు థ్యాంక్స్. ఆఖరి ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నా మైండ్​లో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు. నాకు సూర్య భాయ్ ఒక్కటే చెప్పాడు. ఏమైనా జరగని నువ్వు మాత్రం భయపడకుండా బౌలింగ్ చేయమని సూచించాడు. ఈ సక్సెస్ క్రెడిట్ మాత్రం బ్యాటర్లదే’ అని అర్ష్​దీప్ చెప్పుకొచ్చాడు. మరి.. సూర్య ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే తాను అలా బౌలింగ్ చేశానంటూ అర్ష్​దీప్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Suryakumar Yadav: హార్ధిక్‌ పాండ్యాకు తలనొప్పిగా మారిన సూర్య! ఏమి జరిగిందంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి