iDreamPost

వరల్డ్ కప్ ఫైనల్​ ఓటమిపై రాయుడు షాకింగ్ కామెంట్స్.. మూర్ఖత్వం అంటూ..!

  • Author singhj Published - 06:39 PM, Sun - 26 November 23

ప్రపంచ కప్ ఫైనల్​లో టీమిండియా ఓటమిపై అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత్ ఓడిపోవడానికి ఓ కారణం ఉందన్నాడు.

ప్రపంచ కప్ ఫైనల్​లో టీమిండియా ఓటమిపై అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత్ ఓడిపోవడానికి ఓ కారణం ఉందన్నాడు.

  • Author singhj Published - 06:39 PM, Sun - 26 November 23
వరల్డ్ కప్ ఫైనల్​ ఓటమిపై రాయుడు షాకింగ్ కామెంట్స్.. మూర్ఖత్వం అంటూ..!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్​లో టీమిండియా ఓడిపోవడాన్ని ఇప్పటికీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. తుది మెట్టుపై అలా బోల్తా పడటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎక్స్​పెక్టేషన్స్ పెంచేసి.. ఆఖరికి ఓటమితో కప్పు చేజారడంతో ఆ బాధలో నుంచి బయటకు రావడం లేదు. ఆ మ్యాచ్​లో టాస్ నెగ్గిన కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్ కష్టమనే పిచ్ మీద కమిన్స్ బౌలింగ్ తీసుకొని తప్పు చేశాడని అందరూ అనుకున్నారు. కానీ ఆసీస్ ప్లానింగ్ వేరేలా ఉంది. పిచ్​ను బాగా అర్థం చేసుకున్న అపోజిషన్ టీమ్.. అక్కడ మొదట బౌలింగ్ చేస్తే స్వింగ్, స్పిన్​కు అనుకూలమని గ్రహించింది.

రెండో ఇన్నింగ్స్​లో భారత స్పిన్నర్లు బౌలింగ్ చేసే టైమ్​లో తేమ (డ్యూ) ఉంటుంది. కాబట్టి వాళ్లు ఎంత ప్రయత్నించినా బాల్ తిరగదు. అదే టైమ్​లో స్వింగ్ కూడా అవ్వదు. అందుకే టాస్ నెగ్గి బౌలింగ్​ సెలక్ట్ చేసుకున్నాడు కమిన్స్. అతడి ప్లాన్ వర్కౌట్ అయింది. వాళ్ల బౌలర్లకు తోడుగా ఫీల్డర్లు కూడా అద్భుతంగా రాణించడంతో భారత్​ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. షాట్లు ఆడటం కష్టంగా మారిన పిచ్ మీద రోహిత్ శర్మ కీలక టైమ్​లో ఔటవ్వడం మన టీమ్​ను దెబ్బతీసింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా భారీ స్కోరు చేయలేకపోయారు. ఛేజింగ్​లో తొలుత మహ్మద్ షమి, జస్​ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. కానీ టార్గెట్ తక్కువగా ఉండటం, లబుషేన్ అండగా ట్రావిస్ హెడ్ చెలరేగడంతో మ్యాచ్​తో పాటు కప్పును కంగారూ జట్టు కైవసం చేసుకుంది.

ఫైనల్​లో భారత్ ఓటమికి క్రికెట్ అనలిస్టులు, సీనియర్లు రకరకాల కారణాలు చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఒక పాడ్​కాస్ట్​లో రియాక్ట్ అయ్యాడు. టీమిండియా ఓటమికి స్లో పిచ్ కారణమని అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ కోసం ఇలాంటి మందకొడి పిచ్​ను తయారు చేసి ఉండాల్సింది కాదన్నాడు. పిచ్ ఇంత స్లోగా ఉండాలని ఎవరు సూచించారో తెలియదన్నాడు. ఒకవేళ పిచ్ గనుక వేరేలా ఉండుంటే తప్పకుండా భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవని రాయుడు చెప్పాడు. ఎందుకంటే ప్రత్యర్థి ఆసీస్ కంటే అన్ని విభాగాల్లోనూ టీమిండియా ఎంతో స్ట్రాంగ్​గా ఉందన్నాడు. అయితే ఫైనల్​ మ్యాచ్​లో ఏదీ మనకు కలిసిరాలేదన్నాడు రాయుడు.

‘ఫైనల్​లో టీమిండియాకు అనుకూలంగా పిచ్ ఉంటుందని కొంతమంది అనుకున్నారు. కానీ పిచ్ మరీ స్లోగా ఉండటంతో భారత జట్టు ఇబ్బంది పడింది. అయితే మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగా మారిపోయింది. టాస్​కు ముందు దీనికి ఇంపార్టెన్స్ లేదు. ఏదైనా స్పెషల్ రీజన్​తో ఇలా పిచ్​ను తయారు చేసి ఉంటే మాత్రం ఇంతకుమించిన మూర్ఖత్వం మాత్రం మరొకటి లేదు. కానీ అలా చేసి ఉండరనే అనుకుంటున్నా’ అని రాయుడు చెప్పుకొచ్చాడు. 2019 వరల్డ్ కప్​కు తనను సెలక్ట్ చేయడం మీద కూడా అతను స్పందించాడు. తాను ఆత్మవిశ్వాసంతో లేనని మేనేజ్​మెంట్ అనుకొని ఉండొచ్చన్నాడు. కానీ ఒక వ్యక్తి కాన్ఫిడెంట్​గా ఉన్నాడా? లేడా? అనేది వాళ్లను చూసి ఎలా అంచనా వేస్తారని ఎదురు ప్రశ్నించాడు. మరి.. ఫైనల్లో భారత్ ఓటమికి పిచ్ కారణమంటూ రాయుడు చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మరో లారా అవుతాడనుకుంటే మధ్యలోనే రిటైర్మెంట్.. విండీస్​ స్టార్ బిగ్ షాక్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి