iDreamPost

మరో లారా అవుతాడనుకుంటే మధ్యలోనే రిటైర్మెంట్.. విండీస్​ స్టార్ బిగ్ షాక్

  • Author singhj Published - 03:08 PM, Sun - 26 November 23

విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా మాదిరి బ్యాటింగ్ శైలితో చెలరేగి ఆడుతుంటే అందరూ మరో లారా వచ్చేశాడని అనుకున్నారు. కానీ ఆ స్టార్ క్రికెటర్ కెరీర్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు.

విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా మాదిరి బ్యాటింగ్ శైలితో చెలరేగి ఆడుతుంటే అందరూ మరో లారా వచ్చేశాడని అనుకున్నారు. కానీ ఆ స్టార్ క్రికెటర్ కెరీర్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు.

  • Author singhj Published - 03:08 PM, Sun - 26 November 23
మరో లారా అవుతాడనుకుంటే మధ్యలోనే రిటైర్మెంట్.. విండీస్​ స్టార్ బిగ్ షాక్

లారా.. ఈ పేరు వింటేనే క్రికెట్ లవర్స్​కు గూస్​బంప్స్ వస్తాయి. జెంటిల్మన్ గేమ్​ మీద ఈ కరీబియన్ లెజెండ్ చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. క్రికెట్ హిస్టరీలోనే బెస్ట్ లెఫ్టాండ్ బ్యాటర్​గా, దిగ్గజ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడతను. లారా బ్యాటింగ్ చేస్తుంటే అతడి గ్రేస్ చూస్తూ ఉండిపోవాలంతే. అంత అందంగా బ్యాటింగ్ చేస్తాడతను. బాల్​ను గట్టిగా కొట్టకుండా, స్వీట్ స్పాట్​ను బాల్ మీట్ అయ్యేలా చేస్తాడంతే. టెస్టుల్లో క్వాట్రపుల్ సెంచరీ కొట్టిన ఘనత అతడి పేరు మీదే ఉంది. క్రికెట్​లో ఎంతో డేంజరస్ టీమ్​గా చెప్పుకునే ఆస్ట్రేలియాను కూడా ఎన్నో మ్యాచుల్లో పోయించాడు లారా. అతడికి బౌలింగ్ వేయాలంటే గ్లెన్ మెక్​గ్రాత్ సహా ఆసీస్ బౌలర్లు అంతా భయపడేవారు. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ రేంజ్​లో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

వెస్టిండీస్ నుంచి లారా తర్వాత అలాంటి ప్లేయర్ మరొకరు రాలేదు. రామ్​నరేశ్ శర్వాణ్​, శివ్​నారాయణ్ చందర్​పాల్ చాన్నాళ్ల పాటు టీమ్ భారం మోశారు. ఇక ఆ తర్వాత క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, మార్లోన్ శామ్యూల్స్ లాంటి ఆల్​రౌండర్స్ వల్ల టీ20ల్లో దుమ్మురేపినా.. మిగిలిన ఫార్మాట్లలో మాత్రం తేలిపోయింది. ఆ జట్టు ఆటగాళ్లపై లీగ్స్ ప్రభావం బాగా పడింది. అయితే లారా వారసుడుగా ఒక ప్లేయర్ కనిపించాడు. అతడే డారెన్ బ్రావో. ఎడమ చేతి వాటం ప్లేయర్ అయిన అతడు.. అచ్చం లారా మాదిరిగానే బ్యాటింగ్ చేసేవాడు. దీంతో అతడ్ని అందరూ జూనియర్ లారా అని పిలవడం మొదలుపెట్టారు. 2009లో టీమిండియా మీద వెస్టిండీస్ వన్డే సిరీస్​లో ఫస్ట్ టైమ్ టీమ్​లో చోటు దక్కించుకున్నాడు బ్రావో. తక్కువ టైమ్​లోనే జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

విండీస్ తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్​లు ఆడిన డారెన్ బ్రావో.. టెస్ట్ స్పెషలిస్ట్​గా పేరు తెచ్చుకున్నాడు. 2022లో టీమిండియా మీద చివరి వన్డే ఆడిన బ్రావో.. పేలవ ఫామ్ కారణంగా టీమ్​లో ప్లేస్ కోల్పోయాడు. ఎలాగైనా జట్టులోకి కమ్​బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన అతను.. ఇంటర్నేషనల్ లీగ్స్​లో ఆడుతూనే డొమెస్టిక్ మ్యాచుల్లోనూ పార్టిసిపేట్ చేశాడు. స్వదేశంలో జరిగిన సీజీ యునైటెడ్ సూపర్-50లో రెడ్ ఫోర్స్ టీమ్ విజేతగా నిలవడంలో బ్రావో కీలకపాత్ర పోషించాడు. అయినా అతడికి సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఇంగ్లండ్ టూర్​కు ఈ లెఫ్టాండ్ బ్యాటర్​ను ఎంపిక చేయలేదు. దీంతో సీరియస్​గా ఉన్న బ్రావో ఇక మీదట దేశం తరఫున ఆడొద్దని డిసైడ్ అయ్యాడు.

ఇంగ్లండ్ టూర్​కు తనను పక్కన పెట్టిన సెలక్టర్లు.. కనీస సమాచారం ఇవ్వలేదని బ్రావో అన్నాడు. వాళ్లు తనను చిమ్మ చీకట్లో వదిలేశారని వాపోయాడు. అయితే తాను కన్న కలల్ని నెరవేర్చుకున్నానని తెలిపాడు. తన ప్లేసులో యంగ్​స్టర్స్​కు ఛాన్స్ ఇస్తున్నానని ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన పోస్ట్​లో బ్రావో రాసుకొచ్చాడు. ఇక, నెక్స్ట్ లారా అవుతాడనుకుంటే 34 ఏళ్ల బ్రావో ఇలా మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడంతో విండీస్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. కాగా, తన కెరీర్​లో 56 టెస్టులు ఆడిన బ్రావో 3,538 రన్స్ చేశాడు. 122 వన్డేల్లో 3,109 రన్స్ చేశాడు. లాంగ్ ఫార్మాట్​లో అతడి బెస్ట్ స్కోరు 218 కాగా.. వన్డేల్లో 124. ఐపీఎల్​లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన బ్రావో.. ప్రస్తుతం విండీస్ ప్రీమియర్​ లీగ్​లో ట్రినిడాడ్ అండ్ టొబాగో టీమ్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి.. విండీస్​ క్రికెట్​కు షాకిస్తూ బ్రావో అనూహ్యంగా రిటైర్మెంట్ తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: ఇదెక్కడి విచిత్రమైన బౌలింగ్ మావా.. దెబ్బకి బ్యాటర్ షాక్!

 

View this post on Instagram

 

A post shared by Darren Lilb Bravo (@dmbravo46)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి