iDreamPost

IND vs AUS: ఆసీస్​తో ఆఖరి టీ20.. టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే!

  • Author singhj Published - 08:33 AM, Mon - 4 December 23

ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్​లో నెగ్గి సిరీస్​ను 4-1 తేడాతో ముగించింది భారత్. ఈ మ్యాచ్​లో మన టీమ్ గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్​లో నెగ్గి సిరీస్​ను 4-1 తేడాతో ముగించింది భారత్. ఈ మ్యాచ్​లో మన టీమ్ గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 08:33 AM, Mon - 4 December 23
IND vs AUS: ఆసీస్​తో ఆఖరి టీ20.. టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే!

టీమిండియా తన డామినేషన్​ను కంటిన్యూ చేస్తూ ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్​ను ఘనంగా ముగించింది. ఐదు టీ20ల ఈ సిరీస్​ను 4-1 తేడాతో చేజిక్కించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ట్రిక్కీగా మారిన పిచ్ మీద మొదట బ్యాటింగ్ చేసిన మన జట్టు 8 వికెట్లకు 160 రన్సే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ (53), అక్షర్ పటేల్ (31) రాణించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్​ (21)తో పాటు జితేష్ శర్మ (24)కు మంచి స్టార్ట్ దొరికినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మార్చలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో జేసన్ బెరెన్​డార్ఫ్, బెన్ డ్వార్షూస్​కు చెరో 2 వికెట్లు దక్కాయి. ఛేజింగ్​కు దిగిన కంగారూ టీమ్ 20 ఓవర్లలలో 8 వికెట్లకు 154 రన్స్ మాత్రమే చేయగలిగింది.

ఆసీస్​లో బెన్ మెక్​డెర్మాట్ (54) టాప్ స్కోరర్​గా నిలిచాడు. ఆఖర్లో మ్యాథ్యూ వేడ్ (22) గెలిపించడానికి ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. ఈ మ్యాచ్​లో భారత్ విజయం సాధించడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది టాస్ ఓడిపోవడం. మందకొడిగా ఉన్న పిచ్ మీద టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. భారత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. ఇక్కడ 155 ప్లస్ స్కోరు సాధిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ. అయితే ఆ స్కోరు లోపే టీమిండియాను కట్టడి చేద్దామనే ఉద్దేశంతో మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది అపోజిషన్ టీమ్. అందులో కాస్త సక్సెస్ అయ్యింది. 54 రన్స్​కే నలుగురు భారత బ్యాటర్లను పెవిలియన్​కు పంపింది. కానీ అయ్యర్ నిలబడటం, ఆఖర్లో జితేష్ శర్మ, అక్షర్ పటేల్ బ్యాట్లకు పనిచెప్పడంతో మంచి టార్గెట్​ను ఆసీస్​ ముందు ఉంచింది. ఛేదనలో భారత స్పిన్నర్ల దెబ్బకు ఆ టీమ్ కుదేలైంది. ఈ మ్యాచ్​లో మన టీమ్ గెలవడానికి మరో కారణం శ్రేయస్ అయ్యర్.

ట్రిక్కీ పిచ్ మీద భారత బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు నిలవలేదు. ఓపెనర్లు సహా సూర్యకుమార్ యాదవ్ (5), రింకూ సింగ్ (6) వెంట వెంటనే పెవిలియన్​కు చేరుకున్నారు. కానీ స్టార్ బ్యాటర్ అయ్యర్ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. జితేష్, అక్షర్ పటేల్ లాంటి వారి అండతో ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించారు. శ్రేయస్ నిలబడ్డాడు కాబట్టే టీమ్ మంచి స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్​లో మన గెలుపులో మరో ప్రధాన కారణం సూర్యకుమార్ కెప్టెన్సీ. బౌలింగ్ టైమ్​లో మిస్టర్ 360 తన లీడర్​షిప్ స్కిల్స్​ను బయటపెట్టాడు. సిచ్యువేషన్​ను బట్టి బౌలర్లను రొటేట్ చేస్తూ బ్రేక్ త్రూలు తీసుకురావడంలో మరోసారి సక్సెస్ అయ్యాడు. ఆఖర్లో వేడ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సూపర్బ్​గా ఫీల్డింగ్ సెట్ చేశాడు సూర్య.

రన్స్ ఇస్తున్నా ముకేశ్, అర్ష్​దీప్​ మీద నమ్మకం ఆఖర్లో బౌలింగ్ చేయించాడు సూర్య. ఇది వర్కౌట్ అయి మ్యాచ్ గెలిచాం. ఈ మ్యాచ్​లో భారత గెలుపునకు కారణాల్లో బౌలింగ్ కూడా ఒకటి. ఈ మ్యాచ్​లో స్పిన్నర్లతో పాటు పేసర్లు కూడా రాణించారు. బిష్ణోయ్, అక్షర్ టైమ్​కు బ్రేక్ త్రూలు ఇస్తూ ఆసీస్​ను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ వచ్చారు. మొదట్లో ఫెయిలైన పేసర్స్.. లాస్ట్​లో విజృంభించి బౌలింగ్ చేశారు. ముకేష్ 3 వికెట్లు తీయగా.. అర్ష్​దీప్ 2 వికెట్లతో మెరిశాడు. ఆఖరి టీ20లో భారత్ విజయానికి ప్రధాన కారణాల్లో ఆఖరుది అర్ష్​దీప్ సింగ్ బౌలింగ్. లాస్ట్​ ఓవర్​లో ఆసీస్ గెలుపునకు 10 పరుగులు అవసరం. అవతల ఉన్నది మ్యాథ్యూ వేడ్. అయినా ఏ మాత్రం వెరవకుండా బౌలింగ్ చేసి అతడ్ని ఔట్ చేశాడు. కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చి సింగిల్ హ్యాండ్​తో గెలిపించాడు. మరి.. ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి ఇంకేదైనా కారణం ఉందని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: సఫారీ టూర్​లో ఇద్దరు సీనియర్లకు నో ఛాన్స్.. సెలక్టర్లు చేసిందే కరెక్ట్ అంటున్న గంగూలీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి