iDreamPost
android-app
ios-app

ఆసీస్​పై రింకూ సింగ్ విధ్వంసం! కేవలం 9 బంతుల్లోనే..

  • Author singhj Updated - 03:20 PM, Mon - 27 November 23

ఆస్ట్రేలియాపై వరుసగా రెండో మ్యాచ్​లోనూ రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సులు కొడుతూ అపోజిషన్ బౌలర్లను కంగారెత్తించాడు.

ఆస్ట్రేలియాపై వరుసగా రెండో మ్యాచ్​లోనూ రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సులు కొడుతూ అపోజిషన్ బౌలర్లను కంగారెత్తించాడు.

  • Author singhj Updated - 03:20 PM, Mon - 27 November 23
ఆసీస్​పై రింకూ సింగ్ విధ్వంసం! కేవలం 9 బంతుల్లోనే..

క్రికెట్​లో బ్యాటింగ్ పవర్ ఉన్న టీమ్స్​లో భారత్ ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. సునీల్ గవాస్కర్ దగ్గర నుంచి సచిన్ టెండూల్కర్ వరకు ఎందరో గొప్ప బ్యాటర్లను జెంటిల్మన్ గేమ్​కు అందించింది టీమిండియా. సచిన్ తర్వాత మోడ్రన్ మాస్టర్ విరాట్ కోహ్లీ రూపంలో క్రికెట్​కు మరో సూపర్ స్టార్​ను ఇచ్చింది. అయితే టీమ్​లో సచిన్, కోహ్లీ లాంటి బ్యాటర్లు ఒకరిద్దరు ఉండటమే కాదు.. మిగిలిన బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఎంతో స్ట్రాంగ్​గా ఉండటం భారత్ బలంగా చెప్పుకోవచ్చు. పేసర్లు, స్పిన్నర్లు, ఆల్​రౌండర్లు, కీపర్ల విషయంలో మన టీమ్ ఇబ్బంది పడింది. కానీ బ్యాటింగ్ విషయంలో ఎప్పుడూ మిగతా జట్ల కంటే ఎంతో స్ట్రాంగ్​గా ఉంటూ వస్తోంది.

భారత్​ను బ్యాటర్ల ఖజానాగా చెప్పుకుంటారు. ఇక్కడి నుంచి ఎంతో మంది గ్రేట్ బ్యాటర్స్ వరల్డ్ క్రికెట్​లో సత్తా చాటారు. ప్రస్తుత టీమిండియాలో కూడా చాలా మంది టాప్ బ్యాటర్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ రూపంలో బలమైన బ్యాట్స్​మెన్ మన టీమ్​లో ఉన్నారు. అయితే టీమ్ బెంచ్ స్ట్రెంగ్త్ కూడా అదే రేంజ్​లో ఉండటం కలిసొచ్చే అంశమని చెప్పాలి. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ లాంటి టాలెంటెడ్ యంగ్ క్రికెటర్స్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇందులో ఒక్క రుతురాజ్ తప్ప మిగతా వారందరూ లెఫ్టాండర్లే కావడం విశేషం.

వచ్చే ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే యంగ్ టీమ్​ను రెడీ చేస్తోంది భారత మేనేజ్​మెంట్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పొట్టి ఫార్మాట్​లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో యువకులను తయారు చేస్తుండటం మంచి విషయమనే చెప్పాలి. ఆ వరల్డ్ కప్​తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ సిరీస్ రూపంలో మిగిలిన ఫార్మాట్లలోనూ మున్ముందు కీలక టోర్నమెంట్​లు ఉన్నాయి. కాబట్టి ఈ యంగ్​స్టర్స్​లో ఎవరు టీమ్​కు ఎక్కువ కాలం సేవలు అందించగలరనే దాని మీద మేనేజ్​మెంట్ ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో అందరికీ అవకాశాలు ఇస్తోంది. ఇది బాగానే వర్కట్ అవుతోంది. ఆసీస్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వైజాగ్ మ్యాచ్​లో కంగారూలకు షాక్ ఇచ్చిన యంగ్ ఇండియా.. తిరువనంతపురంలో జరిగిన రెండో మ్యాచ్​లో ఆ టీమ్​ను చిత్తు చేసింది.

ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టిన టీమిండియా 44 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో మన టీమ్ విసిరిన 235 రన్స్​ను ఛేజ్ చేయడంలో ఫెయిలైన ఆసీస్.. ఓవర్లన్నీ ఆడి 191 పరుగులే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్​లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (53) దగ్గర నుంచి ఆఖర్లో వచ్చిన రింకూ సింగ్ (31 నాటౌట్) వరకు అందరూ అదరగొట్టారు. రింకూ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 31 రన్స్ చేశాడు. మొదటి మ్యాచ్​లోనూ చివరి వరకు నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేసిన అతడు.. ఈ మ్యాచ్​లోనూ టీమ్ భారీ స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. అతడి దూకుడు చూస్తుంటే అన్ని ఫార్మాట్లలోనూ టీమ్​లో తన స్థానాన్ని పదిలం చేసుకునేలా కనిపిస్తున్నాడు. రింకూ ఆటకు ఫిదా అయిన ఫ్యాన్స్.. అతడ్ని మరో ధోని అంటున్నారు. మరి.. రింకూ గేమ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయానికి 5 ప్రధాన కారణాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి