iDreamPost

ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయానికి 5 ప్రధాన కారణాలు!

  • Author singhj Published - 08:35 AM, Mon - 27 November 23

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో టీమిండియా గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో టీమిండియా గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 08:35 AM, Mon - 27 November 23
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయానికి 5 ప్రధాన కారణాలు!

వరల్డ్ కప్-2023 ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి భారత్ గట్టిగానే రివేంజ్ తీర్చుకుంటోంది. ఆ టీమ్​తో జరుగుతున్న 5 టీ20 సిరీస్​లో టీమిండియా ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. ఇప్పటికే మొదటి మ్యాచ్​లో గెలిచిన మన టీమ్.. కేరళలోని తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ విక్టరీ కొట్టింది. తాజా విజయంతో ఈ సిరీస్​లో భాతర్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంకా ఈ సిరీస్​లో మూడు మ్యాచులు మిగిలి ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దాంట్లో నెగ్గినా సిరీస్ మన సొంతం అవుతుంది. ఇక, ఆదివారం నాటి మ్యాచ్​లో అన్ని రంగాల్లోనూ టీమిండియా పెత్తనమే నడిచింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది. భారీ స్కోరు ఛేజ్ చేసేందుకు దిగిన ఆస్ట్రేలియా అన్ని ఓవర్లాడి 9 వికెట్లకు 191 రన్స్ మాత్రమే చేసింది.

రెండో టీ20లో కంగారూలను 44 రన్స్ తేడాతో చిత్తు చేసింది టీమిండియా. ఈ విజయానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. మన జట్టు సక్సెస్​కు ప్రధాన కారణాల్లో ఒకటి ఓపెనింగ్ జోడీ అదరగొట్టడం. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 53), రుతురాజ్ గైక్వాడ్​ (43 బంతుల్లో 58) భారత్​కు తిరుగులేని పార్ట్​నర్​షిప్ అందించారు. వీళ్లిద్దరూ కలసి ఫస్ట్ వికెట్​కు 6 ఓవర్లకే 77 రన్స్ జోడించారు. ఇందులో జైస్వాల్ డామినేషనే ఎక్కువ. ఉన్నంత సేపు బౌండరీలు, సిక్సులు కొడుతూ ఆసీస్ బౌలర్లను కంగారెత్తించాడతను. ఈ యంగ్​స్టర్​ను అడ్డుకోవడానికి అపోజిషన్ టీమ్ నానా తంటాలు పడింది.

జైస్వాల్-రుతురాజ్ గట్టి పునాది వేయడంతో ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52), సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 19), రింకూ సింగ్​ (9 బంతుల్లో 31) బ్యాటింగ్ చేయడం ఈజీ అయింది. ఈ మ్యాచ్​లో మన గెలుపులో మరో ప్రధాన కారణం ఫియర్​లెస్ బ్యాటింగ్. ఓపెనర్ జైస్వాల్ దగ్గర నుంచి లాస్ట్​లో వచ్చిన తిలక్ వర్మ వరకు బ్యాటర్లు అందరూ దూకుడు మంత్రాన్నే పఠించారు. వచ్చినోళ్లు వచ్చినట్లు ఫోర్లు, సిక్సులతో అటాకింగ్​కు దిగారు. ఓపెనింగ్ జోడీ మంచి పార్ట్​నర్​షిప్ ఇవ్వడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు అందరూ ఫియర్​లెస్ బ్యాటింగ్ చేశారు. ఇషాన్ అయితే సిక్సులతో ఆసీస్​పై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రింకూ కూడా బౌండరీలు, సిక్సులతో టీమ్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

రెండో టీ20లో భారత్ విజయానికి మరో ప్రధాన కారణం స్పిన్ బౌలింగ్. ఫస్ట్ మ్యాచ్​లో తేలిపోయిన మన స్పిన్నర్లు.. రెండో మ్యాచ్​లో మాత్రం చెలరేగి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ (3/32) ఆసీస్​ బ్యాటర్ల జోరుకు బ్రేకులు వేశాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో జోష్ ఇంగ్లిస్ (2) సహా మాట్ షార్ట్ (19), డేంజరస్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (37)ను బిష్ణోయ్ పెవిలియన్​కు పంపాడు. కీలక సమయాల్లో అతడు వికెట్లు తీయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా ప్రమాదకర గ్లెన్ మాక్స్​వెల్ (12) వికెట్ తీసి కంగారూలను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్​లో అద్భుతమైన కెప్టెన్సీ చేసిన సూర్యకుమార్ భారత విజయానికి ప్రధాన కారణాల్లో ఒకడు.

బౌలింగ్, ఫీల్డింగ్​లో సూర్య చేసిన మార్పులు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఏ బౌలర్​తో కూడా వెంటవెంటనే ఓవర్లు ఇవ్వకుండా బ్యాటర్లను బట్టి మారుస్తూ పోయాడు. ఏదైనా ఒక బౌలర్​ను టార్గెట్ చేసుకుందామని ఆసీస్ భావించిన ప్రతిసారి వాళ్లను మారుస్తూ.. బ్యాటర్లను తికమక పెట్టాడు. ఫోర్లు, సిక్సులు కొట్టినా స్పిన్​లోనే మ్యాక్సీ ఔట్ అవుతాడని తెలిసి అతడి కోసం అక్షర్ పటేల్​తో వరుస ఓవర్లు వేయించాడు. పేస్​లో దుమ్మరేపుతున్న డేవిడ్​ కోసం బిష్ణోయ్​ను బరిలోకి దింపి సర్కిల్, బౌండరీ దగ్గర టైట్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. స్పిన్​ను సమర్థంగా ఎదుర్కొన్న స్టొయినిస్​ను పెవిలియన్​కు పంపేందుకు పేసర్ ముకేష్​తో అటాక్ చేయించాడు.

ఫస్ట్ మ్యాచ్​లో ఓపెనర్ మాట్ షార్ట్ కూడా బిష్ణోయ్​కు చిక్కాడు. అందుకే మళ్లీ అతడి కోసం ఆ స్పిన్నర్​నే రంగంలోకి దింపాడు మిస్టర్ 360. కొత్త కెప్టెన్ అయినా సూర్య మ్యాచ్ కండీషన్స్​ను బ్యాటర్లను బాగా అర్థం చేసుకొని చేసిన మార్పులు భారత్​కు కలిసొచ్చాయి. స్పిన్నర్లతో పాటు పేసర్లు కూడా రాణించడం మన జట్టు విజయానికి మరో ప్రధాన కారణం. మొదటి మ్యాచ్​లో తేలిపోయిన పేసర్లు రెండో టీ20లో గాడిన పడ్డారు. అర్ష్​దీప్ సింగ్, ముకేష్ కుమార్ ఒక్కో వికెట్ తీసినా కీలక సమయాల్లో మంచి బౌలింగ్​తో ఆకట్టుకున్నారు. మరో స్పీడ్​స్టర్ ప్రసిద్ధ్​ కృష్ణ 3 వికెట్లతో చెలరేగాడు. ఆఖర్లో అతడు వేసిన యార్కర్లకు ఆసీస్ బ్యాటర్లకు మైండ్ బ్లాంక్ అయింది. మరి.. టీమిండియా విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: షాకింగ్ నిర్ణయం తీసుకున్న కావ్య! కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ రిలీజ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి