Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ టీ20లో టీమిండియాను గెలిపించిన ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఇంట్రెస్టింట్ స్టేట్మెంచ్ ఇచ్చాడు. ఆయనే తనకు స్ఫూర్తి అని చెప్పాడు.
ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ టీ20లో టీమిండియాను గెలిపించిన ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఇంట్రెస్టింట్ స్టేట్మెంచ్ ఇచ్చాడు. ఆయనే తనకు స్ఫూర్తి అని చెప్పాడు.
Nidhan
టీమ్‌లో అతడు అవసరమా? అన్నారు. అతడ్ని తీసేసి ఇతర యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని చెప్పారు. కానీ ఇప్పుడు అతడే పనికొచ్చాడు. సింగిల్ హ్యాండ్‌తో టీమిండియాకు విక్టరీని అందించాడు. అతడే ఆల్‌రౌండర్ శివమ్ దూబె. మొహాలీ వేదికగా గురువారం రాత్రి ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దూబె అద్భుతంగా ఆడాడు. అటు బంతితో రాణించడమే గాక ఇటు బ్యాట్‌తోనూ రఫ్ఫాడించాడు. ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్‌లో కీలక టైమ్‌లో కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్‌ను వెనక్కి పంపాడు దూబె. రెండు ఓవర్లు వేసి 9 పరుగులు ఇచ్చిన అతడు.. ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో 40 బంతుల్లో 60 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేసి టీమ్ మేనేజ్మెంట్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అలాంటి దూబె తనకు ఒక లెజెండరీ ప్లేయర్ స్ఫూర్తి అన్నాడు.
ఫస్ట్ టీ20 అనంతరం మాజీ ప్లేయర్, కామెంటేటర్ సురేష్ రైనాతో కాసేపు ముచ్చటించాడు దూబె. ఈ సందర్భంగా తన క్రికెటింగ్ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తనకు ఇన్స్పిరేషన్ అన్నాడు. ‘ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ ఛాన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఫిక్స్ అయ్యా. బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యా. మ్యాచులు ఎలా ముగించాలో మాహీ భాయ్ (ఎంఎస్ ధోని) నుంచి నేను నేర్చుకున్నా. అనుకున్నట్లే మ్యాచ్‌ను ఫినిష్ చేశా. మాహీ భాయ్‌తో నేను తరచూ మాట్లాడుతూ ఉంటా. ఆయనో పెద్ద లెజెండ్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. నేనెలా ఆడుతున్నానో ఎప్పటికప్పుడు చెబుతుంటారు. ఆయన మెచ్చుకోవడం వల్లే నేను మరింత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నా. దీని వల్లే నా కాన్ఫిడెన్స్ పెరిగింది’ అని దూబె చెప్పుకొచ్చాడు. తనను నడిపిస్తోంది ధోనీనే అని పేర్కొన్నాడు.
ఈ మధ్య కాలంలో బౌలింగ్ మీద తాను ఎక్కువగా ఫోకస్ చేశానని దూబె తెలిపాడు. దాని రిజల్ట్ ఈ మ్యాచ్‌లో కనిపించిందన్నాడు. ఇది ఓవర్‌నైట్ వచ్చింది కాదన్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు. ఇక దూబేతో చిట్‌చాట్ సందర్భంగా సురేష్ రైనా కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇవాళ దూబె బాగా బౌలింగ్ చేశాడని.. ఈ పెర్ఫార్మెన్స్ను గనుక ధోని చూస్తే ఐపీఎల్లో అతడికి మూడు ఓవర్లు ఇవ్వడం పక్కా అని చెప్పాడు. ఇక, బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇంత టాలెంట్ ఉన్నోడ్ని ఇన్నాళ్లూ ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నిస్తున్నారు. దూబేను టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆడించాలని కోరుతున్నారు. మరి.. ధోనీనే తనకు స్ఫూర్తి అంటూ దూబె చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: గిల్ తనను రనౌట్ చేయడంపై స్పందించిన రోహిత్! ఏమన్నాడో చూడండి..
Shivam Dube said, “I learned it from MS Dhoni, I wanted to finish the match well. I always keep talking to Mahi bhai. He’s such a big legend. I always keep learning from him. He always rates me and that gives me motivation to keep playing well”. pic.twitter.com/BXV2G9RD5j
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2024