iDreamPost

సూపర్-8 కోసం రోహిత్ బిగ్ రిస్క్.. ఈ వరల్డ్ కప్​లో ఎవరూ చేయని సాహసం!

  • Published Jun 19, 2024 | 5:32 PMUpdated Jun 19, 2024 | 5:32 PM

సూపర్-8 పోరుకు సిద్ధమవుతోంది టీమిండియా. తొలి మ్యాచ్​లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్​తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్​లో గెలిచి సెమీస్ దిశగా ఘనంగా అడుగులు వేయాలని చూస్తోంది.

సూపర్-8 పోరుకు సిద్ధమవుతోంది టీమిండియా. తొలి మ్యాచ్​లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్​తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్​లో గెలిచి సెమీస్ దిశగా ఘనంగా అడుగులు వేయాలని చూస్తోంది.

  • Published Jun 19, 2024 | 5:32 PMUpdated Jun 19, 2024 | 5:32 PM
సూపర్-8 కోసం రోహిత్ బిగ్ రిస్క్.. ఈ వరల్డ్ కప్​లో ఎవరూ చేయని సాహసం!

టీ20 ప్రపంచ కప్​లో ఇప్పుడు అసలు పోరుకు అంతా రెడీ అయింది. నిన్నటి వరకు గ్రూప్ స్టేజ్ ఫైట్స్ చూసిన అభిమానులు.. ఇక మీదట సూపర్-8 మ్యాచ్​లను ఎంజాయ్ చేయనున్నారు. సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే ప్రతి మ్యాచ్ కీలకం కావడంతో టీమ్స్​కు చావోరేవో లాంటి పరిస్థితి. కాబట్టి సూపర్-8 చేరిన జట్లు గెలుపు కోసం తమ సర్వశక్తులు ఒడ్డటం ఖాయం. ఈసారి పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి పెద్ద జట్లు సూపర్ పోరుకు అర్హత సాధించలేదు. యూఎస్​ఏ, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి అండర్​డాగ్స్ అద్భుత ఆటతీరుతో నెక్స్ట్ స్టేజ్​కు క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా, టీమిండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి బడా జట్లతో ఇవి తలపడుతుంటే చూడాలని అంతా ఎగ్జయిటింగ్​గా ఉన్నారు.

సూపర్ పోరు కోసం ఎవరి ప్లానింగ్స్​తో వాళ్లు బిజీగా ఉన్నారు. కరీబియన్ పిచ్​లకు అలవాటు పడిన బంగ్లా, ఆఫ్ఘాన్, ఆసీస్ జట్లు ఇప్పటిదాకా ఫాలో అయిన వ్యూహాలనే ఇక మీదట కూడా అనుసరించాలని భావిస్తున్నాయి. అయితే గ్రూప్ దశ మ్యాచులను పూర్తి చేసుకొని అమెరికా నుంచి తిరిగొచ్చిన టీమిండియా.. విండీస్ వికెట్ల మీద సరికొత్త ప్లాన్​తో ముందుకెళ్లాలని చూస్తోంది. సూపర్-8 కోసం నలుగురు స్పిన్నర్ల మంత్రాన్ని జపించాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్​ను సూపర్ పోరులో ప్రధాన అస్త్రంగా వాడాలని టీమ్ మేనేజ్​మెంట్​తో కలసి హిట్​మ్యాన్ డిసైడ్ అయ్యారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

రోహిత్ స్పిన్ అస్త్రంతో వెళ్లనున్నాడనే వార్తలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అతడి ప్లాన్ సూపర్బ్ అని అంటుంటే.. ఇది బిగ్ రిస్క్ అని మరికొందరు చెబుతున్నారు. సూపర్-8 మ్యాచులకు ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్​ పిచ్​లు పేస్​తో పాటు స్పిన్​కు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటిదాకా అక్కడ జరిగిన మ్యాచ్​ల్లో పేసర్లు ఎక్కువ వికెట్లు తీశారు. వేరియేషన్స్​తో బౌలింగ్ చేసే వారికి ఎక్కువ వికెట్లు దక్కాయి. ఈ వరల్డ్ కప్​లో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో చూసుకుంటే టాప్-5 వికెట్ టేకర్స్​లో అకీల్ హొస్సేన్ (వెస్టిండీస్) ఒక్కడే స్పిన్నర్, మిగతా వాళ్లంతా పేసర్లే. ఇది తెలిసి కూడా సూపర్-8 కోసం నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో వెళ్లాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం. విండీస్​ పిచ్​లు స్పిన్ ఫ్రెండ్లీ కాబట్టి ఈ సాహసం చేసేందుకు రోహిత్ రెడీ అవుతున్నాడట. ఇప్పటిదాకా మెగాటోర్నీలో ఇంత మంది స్పిన్నర్లను ఏ టీమ్ కూడా ఆడించలేదు. ఆ రకంగా హిట్​మ్యాన్​ది బిగ్ రిస్క్ అనే చెప్పాలి. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే టీమిండియాకు తిరుగుండదు. కానీ ఏమాత్రం తేడా వచ్చినా అందరూ హిట్​మ్యాన్​ను ట్రోల్ చేయడం తప్పదేమోనని అనిపిస్తోంది. మరి.. నలుగురు స్పిన్నర్ల వ్యూహంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి