Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన విక్టరీ కొట్టడానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన విక్టరీ కొట్టడానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20 సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. గురువారం రాత్రి మొహాలీలో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ప్రత్యర్థి జట్టును 158 పరుగులకు కట్టడి చేసింది టీమిండియా. ఆ టార్గెట్‌ను 17.3 ఓవర్లలో ఛేజ్ చేసేసింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ టీ20లో రోహిత్ సేన విజయం సాధించడానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి బౌలింగ్. మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘాన్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. మంచి స్టార్ట్స్ అందుకున్న రెహ్మానుల్లా గుర్బాజ్ (23), ఇబ్రహీం జాద్రాన్ (25), అజ్మతుల్లా ఒమర్జాయి (29)లు భారీ స్కోర్లు చేయకుండా అడ్డుకున్నారు. ముకేష్ కుమార్ (2/32), అక్షర్ పటేల్ (2/23) ఆకట్టుకున్నారు. శివమ్ దూబె (1/9) ఒక వికెట్ పడగొట్టాడు.
అర్ష్‌దీప్ వికెట్ తీయకపోయినా రన్స్ ఇవ్వకుండా ఆఫ్ఘాన్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. తొలి టీ20లో భారత్ విజయానికి మరో ప్రధాన కారణం బ్యాటింగ్. మోస్తరు టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే యంగ్‌స్టర్స్ శుబ్‌మన్ గిల్ (12 బంతుల్లో 23), తిలక్ వర్మ (22 బంతుల్లో 26) భయపడలేదు. వరుసగా బౌండరీలు, సిక్సులు కొడుతూ ఆఫ్ఘాన్ బౌలర్లపై ప్రెజర్ పెంచారు. ఈ క్రమంలో వాళ్లిద్దరూ వెనుదిరిగినా తర్వాత వచ్చిన శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్), జితేష్ శర్మ (20 బంతుల్లో 31), రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్) హిట్టింగ్‌కు దిగడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది.
ముఖ్యంగా దూబె ఇన్నింగ్స్‌ను మెచ్చుకోవాలి. రాకరాక వచ్చిన ఛాన్స్‌ను పూర్తిగా వినియోగించుకున్న అతడు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. ఆఖర్లో నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి మూడో కారణం ఆల్‌రౌండర్లు చెలరేగడం. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ దూబె 1 వికెట్ తీయడంతో పాటు 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. క్రీజులో కుదురుకున్న ఆఫ్ఘాన్ ఓపెనర్లను వీళ్లిద్దరూ వెనక్కి పంపారు. దూబె బౌలింగ్ చేయడంతో సిక్త్ బౌలర్ లేక ఇబ్బంది పడుతున్న భారత్‌కు బౌలింగ్ ఆప్షన్స్ పెరిగాయి. తనపై టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని సత్తా చాటాడు. ఆఖరి వరకు నిలబడి మ్యాచ్‌ను ముగించడం స్పెషల్. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపునకు మరో కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీ.
అక్షర్, సుందర్, దూబె రూపంలో ముగ్గురు ఆల్రౌండర్లను ఆడించిన హిట్‌మ్యాన్.. వారిని అవసరానికి తగ్గట్లు వాడుకున్నాడు. బ్రేక్ త్రూలు కావాలన్నప్పుడు వాళ్లను దించి ఫలితాలు రాబట్టాడు. ఆఫ్ఘాన్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. బ్యాటింగ్‌లో కూడా దూబేను మిడిలార్డర్లో ఆడించడంతో అతడు రన్స్ చేయడమే గాక మ్యాచ్‌ను ఫినిష్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చివరి కారణం టాస్. మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన మొహాలీలో రాత్రిపూట తేమ ఎక్కువగా కురుస్తుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. అందుకే టాస్ నెగ్గిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది కూడా మన టీమ్‌కు కలిసొచ్చింది. మరి.. తొలి టీ20లో భారత్ విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: పాపం.. రోహిత్ డక్ ఔట్! తప్పు గిల్ దా? రోహిత్ దా?
Shivam Dube, The Star. 🇮🇳
– Dube won the Player of the match in his return match for India. pic.twitter.com/0IVsaGXxbC
— Johns. (@CricCrazyJohns) January 11, 2024