iDreamPost
android-app
ios-app

Sarfaraz Khan: తొలి మ్యాచ్‌తోనే చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ ఖాన్‌!

  • Published Feb 15, 2024 | 6:08 PM Updated Updated Feb 15, 2024 | 6:08 PM

తన డెబ్యూ మ్యాచ్ లోనే ఓ రేర్ ఫీట్ సాధించాడు 'అభినవ బ్రాడ్ మన్' గా గుర్తింపు తెచ్చుకున్న సర్పరాజ్ ఖాన్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఫిఫ్టీ చేయడంతో.. ఈ ఘనతకెక్కాడు. దీంతో తొలి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

తన డెబ్యూ మ్యాచ్ లోనే ఓ రేర్ ఫీట్ సాధించాడు 'అభినవ బ్రాడ్ మన్' గా గుర్తింపు తెచ్చుకున్న సర్పరాజ్ ఖాన్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఫిఫ్టీ చేయడంతో.. ఈ ఘనతకెక్కాడు. దీంతో తొలి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

Sarfaraz Khan: తొలి మ్యాచ్‌తోనే చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ ఖాన్‌!

సర్ఫరాజ్ ఖాన్.. టీమిండియాలోకి రాక ముందే సెన్సేషనల్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. దేశవాలీ క్రికెట్ లో పరుగులవరద పారించి.. ఎప్పుడెప్పుడు టీమిండియాలోకి ఎంటర్ అవుదామా అని ఎదురుచూశాడు. తాజాగా అతడి నిరీక్షణకు తెర దించుతూ.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ కు జట్టులోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు. డొమెస్టిక్ క్రికెట్ లో చిచ్చరపిడుగులా చెలరేగి పరుగులు సాధించిన ఈ ప్లేయర్.. తన డెబ్యూ మ్యాచ్ లో కూడా అదేతీరున చెలరేగాడు. తొలి మ్యాచ్ లోనే అర్దశతకంతో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. దీంతో తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ చేసింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది భారత జట్టు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (110*) సెంచరీలతో చెలరేగారు. ఇక అరంగేట్ర బ్యాటర్ ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో చెలరేగాడు. తొలి మ్యాచ్ లోనే కేవలం 48 బంతుల్లో అర్దశతకం బాది అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఓవరాల్ గా 66 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, ఓ సిక్స్ తో 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ గా వెనుదిరిగాడు.

ఇక తన తొలి మ్యాచ్ లోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు సర్ఫరాజ్. అదేంటంటే? డెబ్యూ మ్యాచ్ లో అత్యంత ఫాస్ట్ గా(48 బంతుల్లో) ఫిఫ్టీ చేసిన తొలి టీమిండియా క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీ సాధించడంతో.. అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదీకాక తన తొలి మ్యాచ్ లోనే ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్ లా చక్కటి షాట్స్ తో అలరించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. తన మార్క్ ఆటతీరుతో అలరించాడు. ఇక తన భర్త తొలి మ్యాచ్ చూడ్డానికి వచ్చిన సర్ఫరాజ్ భార్య కన్నీటి పర్యంతమైంది.

ఈ క్రమంలోనే సర్ఫరాజ్ ఖాన్ తండ్రి కూడా భావోద్వేగానికిలోనై.. కొడుకుని చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 326 పరుగులు చేసింది. రోహిత్(131), జడేజా(110*), సర్ఫరాజ్ ఖాన్(62) పరుగులతో రాణించగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు. మరి తొలి మ్యాచ్ లోనే రేర్ ఫీట్ సాధించిన యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Sarfaraz Khan: వీడియో: సర్ఫరాజ్ రనౌట్.. జడేజాపై కోపంతో క్యాప్ విసిరికొట్టిన రోహిత్!