Somesekhar
టీమిండియా యువ క్రికెటర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్. అతడు టాలెంటెడ్ ప్లేయర్ అని, కానీ రన్స్..
టీమిండియా యువ క్రికెటర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్. అతడు టాలెంటెడ్ ప్లేయర్ అని, కానీ రన్స్..
Somesekhar
ఇంగ్లండ్ తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా తడబడింది. టాపార్డర్ పూర్తిగా విఫలం కావడంతో.. రెండోరోజు 7 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ భారత జట్టును దెబ్బతీశాడు. అతడు 4 వికెట్లతో చెలరేగాడు. ఇక ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్.. ఓ టీమిండియా యంగ్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు. అతడు టీమిండియాలో వెరీ టాలెంటెడ్ ఆటగాడని కితాబిచ్చాడు. కానీ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. మరి రూట్ మెచ్చిన ఆ ప్లేయర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.
జో రూట్.. కష్టాల్లో ఉన్న టీమ్ ను అద్భుతమైన సెంచరీతో ఆదుకున్నాడు. 274 బంతుల్లో 10 ఫోర్లతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 353 రన్స్ చేసింది. ఇక రెండోరోజు ఆటముగిసిన తర్వాత రూట్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ టీమిండియా యంగ్ ప్లేయర్ పై పొగడ్తలు కురిపించాడు. “ధృవ్ జురెల్ టీమిండియాలో చాలా ప్రతిభావంతుడైన ప్లేయర్.. కానీ ఓ ఇంగ్లీష్ క్రికెటర్ గా అతడు ఎక్కువ పరుగులు చేయకూడదని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 రన్స్ కు ఆలౌట్ కాగా.. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మను స్టార్ బౌలర్ అండర్సన్ 2 రన్స్ కే వెనక్కిపంపించాడు. ఆ తర్వాత వచ్చిన శుబ్ మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు యశస్వీ జైస్వాల్. కానీ గిల్ కూడా 38 రన్స్ కే అవుట్ కావడంతో.. భారత వికెట్లు వెంటవెంటనే కూలాయి. జైస్వాల్ ఒక్కడే 73 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం క్రీజ్ లో వికెట్ కీపర్ ధృవ్ జురెల్(41) పరుగులు చేసి.. అర్ధశతకం వైపు వెళ్తున్నాడు. మరో ఎండ్ లో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన జిడ్డు బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఇప్పటికే 116 బంతులు ఎదుర్కొని 25 పరుగులతో ఆడుతున్నాడు. 84 ఓవర్లలకు 7 వికెట్లు కోల్పోయి 243 రన్స్ చేసిన టీమిండియా.. ఇంకా 110 పరుగులు వెనకబడి ఉంది.
Joe Root said, “Dhruv Jurel is very very talented and as a English cricketer I hope he doesn’t score many runs.” pic.twitter.com/Jpfkb3hUdr
— CricketGully (@thecricketgully) February 24, 2024
ఇదికూడా చదవండి: రియల్ హీరోను కలిసిన సచిన్.. స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు! వీడియో వైరల్