iDreamPost
android-app
ios-app

రియల్ హీరోను కలిసిన సచిన్.. స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు! వీడియో వైరల్

  • Published Feb 24, 2024 | 8:33 PM Updated Updated Feb 24, 2024 | 8:33 PM

తాను ఓ రియల్ హీరోను కలిశానని, అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడని ఓ వీడియోను పోస్ట్ చేశాడు టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాను ఓ రియల్ హీరోను కలిశానని, అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడని ఓ వీడియోను పోస్ట్ చేశాడు టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Feb 24, 2024 | 8:33 PMUpdated Feb 24, 2024 | 8:33 PM
రియల్ హీరోను కలిసిన సచిన్.. స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు! వీడియో వైరల్

టీమిండియా దిగ్గజం, మాజీ ఆటగాడు సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ పర్యటిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ భూతల స్వర్గంలోని మంచును ఆస్వాదిస్తూ.. గల్లీ క్రికెట్ ఆడుతూ.. జవాన్లతో సరదాగా గడుపుతున్నాడు. ఇక కుటుంబంతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా సచిన్ షేర్ చేసిన ఓ వీడియో మాత్రం క్రికెట్ ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. మరి ఆ వీడియోలో ఏముంది? ఎందుకంత స్పెషల్? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం కశ్మీర్ పర్యటనను ఫ్యామిలీతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. అక్కడ గల్లీల్లో క్రికెట్ ఆడుతూ.. జవాన్లతో సరదాగా గడుపుతూ.. వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే వెకేషన్ ను ఆస్వాదించడమే కాదు.. తనలో ఉన్న గొప్ప మనసును కూడా చాటుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. కశ్మీర్ లో ఉన్న సచిన్ ఓ వీడియోను తాజాగా షేర్ చేశారు. ఆ వీడియో అభిమానుల హృదయాలను హత్తుకుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

అమిర్ హుస్సేన్.. జమ్ము కశ్మీర్ కు చెందిన దివ్యాంగ క్రికెటర్. కొన్ని రోజుల క్రితం సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న టీమిండియా జెర్సీని ధరించి.. ప్రాక్టీస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తనకు రెండు చేతులు లేకపోయినా.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియో చూసిన క్రికెట్ గాడ్ సచిన్, కశ్మీర్ వెళ్లినప్పుడు అమిర్ ను కలిసి అతడి పేరుతో ఉన్న జెర్సీని గిఫ్ట్ గా తీసుకుంటానని కూడా చెప్పాడు. తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. అమిర్ ను కలిసి సంతకం చేసిన బ్యాట్ ను అతడికి గిఫ్ట్ గా ఇచ్చాడు సచిన్. అంతేకాకుండా.. రెండు చేతులు లేకపోయినా.. ఎలా బ్యాటింగ్ చేస్తాడో అడిగి మరీ తెలుసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ పంచుకుంటూ..” అమిర్ నువ్వు నిజమైన హీరో, ఎప్పుడూ నువ్విలాగే అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉండాలి. నిన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది” అంటూ అతడితో గడిపిన సమయాన్ని వీడియో ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు సచిన్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మాస్టర్ బ్లస్టర్ అమిర్ హుస్సేన్ ను కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: ఫ్యాన్స్ పై కోపంతో ఊగిపోయిన బాబర్.. బూతులు తిడుతూ.. బాటిల్ విసురుతూ..!

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom