iDreamPost

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి బిగ్ షాక్.. 10 ఏళ్లు జైలుశిక్ష

Imran Khan Sentenced 10 Year Jail: ఇటీవల పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్-పీటీఐ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఆయనకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Imran Khan Sentenced 10 Year Jail: ఇటీవల పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్-పీటీఐ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఆయనకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి బిగ్ షాక్.. 10 ఏళ్లు జైలుశిక్ష

సినీ, క్రీడా రంగానికి చెందిన ఎంతోమంది రాజకీయల్లోకి వచ్చారు. ఒకప్పుడు క్రికెట్ మైదానంలో తన ఆటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ ప్లేయర్ ఇమ్రాన్ ఖాన్ రిటైర్ మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. పాక్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ – పీటీఐ పార్టీని కి చైర్మన్ గా కొనసాగారు.   పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రభుత్వానికి వచ్చిన బహుమతుల విషయంలో అవినీతికి పాల్పడ్డారని, అధికార రహస్యాల పత్రాల విషయంలో గోల్ మాల్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఇస్లామాబాద్ కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కి మరో షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే..

మాజీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి మరో గట్టి దెబ్బ తగిలింది. అధికారిక రహస్య పత్రాలను బయటపెట్టిన కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషికి ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే ఆయనపై ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదం ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయే ముందు భారీ ర్యాలీలో పాల్గొని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని కొన్ని పత్రాలను ప్రదర్శించారు. అమెరికాలోని పాక్ ఎంబసి నుంచి తాను వాటిని సేకరించినట్లు వివరణ ఇచ్చారు.. అయితే ప్రత్యేక కోర్టు లో ఆ కేసు విచారణ జరిగి.. ఇమ్రాన్ ఖాన్, ఖరేషీ అవినీతికి పాల్పడినట్టు దోషిగా తేల్చి పదేళ్లు జైలు శిక్ష విధించింది.

ఇటీవల తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హై కోర్టు నిలిపివేసింది. ఆ వెంటనే ఇమ్రాన్ ఖాన్ సైఫర్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలో అడియాలా జైలులో ఉన్నారు. ఇటీవల సైఫర్ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై చార్జిషీట్ సమర్పించింది. మాజీ ప్రధాని కేసు కనుక భద్రతా సమస్యలు రావొచ్చు అన్న కారణంతో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైన్ జైల్లోనే విచారణ చేపట్టి.. తాజాగా ఇద్దరికీ పదేళ్లు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి