iDreamPost
android-app
ios-app

ఏపీకి తుఫాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది...

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది...

ఏపీకి తుఫాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతులతో పాటు సాధారణ జనం కూడా ఇబ్బందుల పాలయ్యారు. ఇప్పటికీ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుంది. ఈ మేరకు వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ సమీపంలో మలక్కా జలసంధి ప్రాంతంలో బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతవరణ శాఖ వెల్లడించింది.

ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబరు 29 నాటికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. అనంతరం.. 48 గంటల్లో తుఫానుగా బలపడే ఆవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో వాయువ్యంగా పయనించి వచ్చే నెల ఒకటో తేదీకల్లా తుఫాన్ గా బలపడనుందని భారత వాతవరణ శాఖ తెలిపింది. ఆ తరువాత అది ఉత్తర ఈశాన్య దిశ వైపు వెళ్లి వచ్చే నెల 4వ తేదీకల్లా తీవ్ర తుఫానుగా బలపడుతుందని వెల్లడించింది.

మళ్లీ 5వ తేదీకల్లా ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర తుఫానుగా దాటుతుందని అంచనా వేసింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. అయితే కొన్ని జిల్లాలు..  నంద్యాల , అనంతపురం శ్రీ సత్యసాయి కడప, చిత్తూరు , అన్నమయ్య , తిరుపతి, ప్రకాశం నెల్లూరు, పల్నాడు లోని ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే ఆవకాశం ఉందని పేర్కొంది. ఈ అకాల వర్షాల కారణంగా.. రైతులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.

పంట చేతికి అందే సమయం కావడంతో.. భారీ వర్షాలు కురువటం అన్నదాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో తీవ్ర నష్టం వాటిలిందని రైతులు వాపోతున్నారు. ఇక, తెలంగాణకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో నేటినుంచి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సిరిసిల్ల, జనగాం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వర్షాలు ఇలానే కురిస్తే.. పంట నష్టం అవ్వటమే కాదు.. పంట నష్టం ప్రభావం కారణంగా భవిష్యత్తులో కూరగాయల ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి