iDreamPost
android-app
ios-app

రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ!

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ!

కొద్ది రోజుల క్రితం తీవ్ర ఎండలు, ఉక్కపోతతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త త్వరగానే రాష్ట్రంలోకి వస్తాయని చల్లని కబురు చెప్పింది. చెప్పినట్లుగానే అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే తాజాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. అనుకున్నదాని కంటే రెండ్రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రానున్నాయని తెలిపింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, జూన్ 5న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. దాంతో ఆయా జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది  వాతావరణ శాఖ. ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Heavy rains in the state today

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతోపాటు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక ఆదివారం రాష్ట్రంలోని చాలా చోట్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కాగా.. నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తుండటంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి