iDreamPost

ఎట్టకేలకు భర్తను పరిచయం చేసిన ఇలియానా! పిక్స్ వైరల్..

  • Author Soma Sekhar Published - 07:21 PM, Sat - 25 November 23

ఈ ఏడాది ఆగస్టులో బిడ్డకు జన్మనిచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. కానీ తన భర్త ఎవరన్నది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇక ఎట్టకేలకు తన భర్త పిక్ ను రివీల్ చేసింది ఈ భామ.

ఈ ఏడాది ఆగస్టులో బిడ్డకు జన్మనిచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. కానీ తన భర్త ఎవరన్నది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇక ఎట్టకేలకు తన భర్త పిక్ ను రివీల్ చేసింది ఈ భామ.

  • Author Soma Sekhar Published - 07:21 PM, Sat - 25 November 23
ఎట్టకేలకు భర్తను పరిచయం చేసిన ఇలియానా! పిక్స్ వైరల్..

ఇలియానా.. ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా బ్యూటీ. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో.. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు తో పోకిరి, పవర్ స్టార్ తో జల్సా, రవితేజతో కిక్, అల్లు అర్జున్ తో జులాయి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత ఈ జీరో సైజ్ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోవడంతో.. క్రమంగా పరిశ్రమకు దూరం అయ్యింది. కాగా.. ఏడాది ఆగస్టులో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ తన భర్త ఎవరన్నది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఎట్టకేలకు తన భర్త పిక్ ను రివీల్ చేసింది ఈ భామ.

ఇలియానా.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి జీరో సైజ్ నడుమే గుర్తుకు వస్తుంది. ఈ గోవా బ్యూటీ నడుముకు ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తికాదు. తెలుగులో 10కి పైగా సినిమాల్లో నటించి.. స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు తక్కువ కావడంతో.. తన మకాంను బాలీవుడ్ కు మార్చింది. అక్కడ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఆగస్టులో ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తన భర్త ఎవరు? అన్న విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. కానీ కొన్నిరోజుల తర్వాత ఓ వ్యక్తితో ఉన్న ఫొటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. అయితే అందులో అతడు తన భర్తా? కాదా? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేస్తుండగా.. ఓ నెటిజన్ మీరు సింగిల్ పేరెంటా? అని ప్రశ్నించాడు. దీనికి బదులిస్తూ.. తన భర్తతో కలిసి ఉన్న పిక్ ను స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో అతడు ఎవరు? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. అతడి పేరు మైఖేల్ డోలన్ అని మాత్రమే తెలుస్తోంది. డోలన్ కు సంబంధించిన మిగతా వివరాలేవీ తెలియరావడం లేదు. ఇక వీరిద్దరూ ఈ ఏడాది మే నెలలోనే పెళ్లి చేసుకున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. ఈ బ్యూటీ నటించిన రెండు హిందీ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి