iDreamPost
android-app
ios-app

కోహ్లీ కోసం అశ్విన్ చేసిన పనేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • Author singhj Updated - 02:26 PM, Mon - 9 October 23
  • Author singhj Updated - 02:26 PM, Mon - 9 October 23
కోహ్లీ కోసం అశ్విన్ చేసిన పనేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా ఆడిన తొలి మ్యాచ్​లోనే ఫ్యాన్స్​కు కావాల్సినంత మజా దొరికింది. చెన్నైలోని చెపాక్​ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో మొదట ఆస్ట్రేలియాను త్వరగా కట్టడి చేసింది భారత్. ఆ తర్వాత ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు డకౌట్​గా పెవిలియన్​కు చేరడంతో అంతా షాక్. కానీ తామున్నామంటూ విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ సొగసైన ఇన్నింగ్స్​లతో గెలిపించారు. దీంతో భారత అభిమానులు సంతోషంతో సంబురాల్లో మునిగిపోయారు. వరుసగా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్​ ఔటవ్వడంతో చాలా టెన్షన్ కలిగింది. ఆ తర్వాత కోహ్లీ కూడా కాస్తయితే క్యాచ్ ఔటయ్యేవాడు.

జోష్ హేజల్​వుడ్ బౌలింగ్​లో కోహ్లీ కొట్టిన బాల్ గాల్లోకి లేచింది. అయితే దాన్ని క్యాచ్ పట్టేందుకు అలెక్స్ కేరీతో పాటు మిచెల్ మార్ష్ ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చారు. మార్ష్ బాల్​ను పట్టేందుకు ప్రయత్నించి ఫెయిలయ్యాడు. ఆ టైమ్​లో అభిమానులతో పాటు టీమిండియా ప్లేయర్లలోనూ ఆందోళన రేగింది. కమిన్స్ క్యాచ్ పట్టి ఉంటే మాత్రం భారత్ కథ అక్కడే ముగిసేదేమో! ఇదే విషయంపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెన్షన్​కు గురయ్యాడట. అంతేకాదు కోహ్లీ కోసం అశ్విన్ చేసిన ఒక పని తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే.

‘ఆ టైమ్​లో నేను డ్రెస్సింగ్ రూమ్​లో ఉన్నా. ఒక్కో వికెట్ పడటం.. ఆ తర్వాత కోహ్లీ కొట్టిన బాల్ గాల్లోకి లేవడంతో డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు పరిగెత్తా. ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే క్యాచ్ చేజారడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం నేనూ డ్రెస్సింగ్ రూమ్​లోకి వెళ్లిపోయా. కానీ గేమ్ పూర్తయ్యే వరకు అక్కడ ఒకే ప్లేసులో ఉండిపోయా. ఇప్పటికి కూడా నా కాళ్లు కాస్త నొప్పిగానే ఉన్నాయి. ఇది వరల్డ్ కప్ టోర్నీ. అందులోనూ ఆస్ట్రేలియా లాంటి టీమ్​ను 199 రన్స్​కే ఆలౌట్ చేశాం. అయినా ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ల పోరాటం ఆ స్థాయిలో ఉంటుంది’ అని అశ్విన్ స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: ఆసీస్‌తో బ్యాటింగ్‌కు దిగే ముందు జరిగిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన రాహుల్‌!