iDreamPost
android-app
ios-app

షమి జేబులో మరో బాల్​ను దాస్తున్నాడు.. పాక్ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

  • Author singhj Published - 08:00 PM, Thu - 16 November 23

సెన్సేషనల్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్​తో టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్​కు చేర్చాడు పేసర్ మహ్మద్ షమి. ఒంటిచేత్తో న్యూజిలాండ్​ను కుప్పకూల్చాడతను. అయితే షమి బౌలింగ్​పై నెట్టింట ట్రోలింగ్ నడుస్తోంది.

సెన్సేషనల్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్​తో టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్​కు చేర్చాడు పేసర్ మహ్మద్ షమి. ఒంటిచేత్తో న్యూజిలాండ్​ను కుప్పకూల్చాడతను. అయితే షమి బౌలింగ్​పై నెట్టింట ట్రోలింగ్ నడుస్తోంది.

  • Author singhj Published - 08:00 PM, Thu - 16 November 23
షమి జేబులో మరో బాల్​ను దాస్తున్నాడు.. పాక్ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

వన్డే వరల్డ్ కప్-2023 లీగ్ మ్యాచుల్లో వరుస విజయాలతో ఎక్స్​పెక్టేషన్స్ పెంచేసిన టీమిండియా.. నాకౌట్ మ్యాచ్​లోనూ అదే జోరును కంటిన్యూ చేసింది. ఫేవరెట్స్​లో ఒకటైన న్యూజిలాండ్​తో ముంబైలోని వాంఖడేలో జరిగిన మ్యాచ్​లో భారత్ 70 రన్స్ తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో మెగాటోర్నీలో ఫైనల్​కు చేరుకుంది. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో సెమీస్​లో నెగ్గిన టీమ్​తో రోహిత్ సేన ఫైనల్​లో అమీతుమీ తేల్చుకోనుంది. కివీస్​తో నాకౌట్ మ్యాచ్​లో భారత్ విజయంలో పేస్ బౌలర్ మహ్మద్ షమి పాత్ర చాలా ఉంది. తోటి బౌలర్లు వికెట్లు తీయడానికి కష్టపడుతున్న టైమ్​లో.. ఈ స్పీడ్​స్టర్ ఏకంగా 7 వికెట్లు తీశాడు.

టీమిండియా చేతి నుంచి మ్యాచ్ జారిపోతుందనుకున్న టైమ్​లో సెకండ్ స్పెల్​కు వేయడానికి వచ్చిన షమి అద్భుతమే చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్​ను తిరిగి గేమ్​లోకి తీసుకొచ్చాడు. చివరి రెండు వికెట్లు కూడా తన అకౌంట్​లో వేసుకొని ఒంటిచేత్తో టీమ్​కు విజయాన్ని అందించాడు. ఈ ప్రపంచ కప్​లో అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్​గానే కాదు.. ఐసీసీ వరల్డ్ కప్​ హిస్టరీలో అత్యంత వేగంగా (17 ఇన్నింగ్స్​లు) 50 వికెట్లు పడగొట్టిన బౌలర్​గానూ షమి రికార్డు సృష్టించాడు. లీగ్ స్టేజ్​లో రెండు సార్లు 5 వికెట్ల పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టాడు.

ఈ ఏడాది భీకర ఫామ్​లో ఉన్న మహ్మద్ షమీని తొలుత వరల్డ్ కప్ టీమ్​లోకి తీసుకోలేదు. లీగ్ స్టేజ్​లో టీమిండియా ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో ఈ పేసర్​కు తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా అనుకోకుండా గాయం బారిన పడి టీమ్​కు దూరమయ్యాడు. ఇంజ్యురీ నుంచి కోలుకోకపోవడంతో అతడు మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో హార్దిక్ ప్లేసులో షమీని జట్టులోకి తీసుకున్నారు. అయితే ఇన్నాళ్లూ తనను ఆడించకుండా తప్పు చేశారంటూ తన పెర్ఫార్మెన్స్​తో ప్రూవ్ చేశాడు షమి.

పటిష్టమైన న్యూజిలాండ్​ బ్యాటర్లను బెంబేలెత్తించిన ఈ వెటరన్ పేసర్.. ఆ తర్వాత ఇంగ్లండ్​పై 4 వికెట్లు, శ్రీలంక మీద 5 వికెట్లు, సౌతాఫ్రికాపై 2 వికెట్లు తీశాడు. లీగ్ స్టేజ్​లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్​తో ఇన్నాళ్లు తనను ఆడించకుండా టీమ్ మేనేజ్​మెంట్ తప్పు చేసిందని షమి ప్రూవ్ చేశాడు. ఒక దశలో టీమ్​లో ప్లేస్ లేక ఇబ్బంది పడిన షమి.. బుధవారం జరిగిన సెమీస్​లో న్యూజిలాండ్​పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఏకంగా 7 వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు. ఇదిలా ఉంటే.. షమి బౌలింగ్​పై నెట్టింట కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు.

మహ్మద్ షమి బౌలింగ్​పై వస్తున్న ట్రోల్స్ మీద పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. మ్యాచ్ బాల్​ను పాకెట్​లో దాచి, తన సొంత బాల్​తో షమి బౌలింగ్ చేస్తున్నాడంటూ కొందరు తలతిక్కగా మాట్లాడుతున్నారని భట్ సీరియస్ అయ్యాడు. ఇలాంటి కామెంట్లు చేసేవారికి అందరూ దూరంగా ఉండాలని సూచించాడు. ఎవరైనా బాగా పెర్ఫార్మ్ చేస్తే లేచి నిలబడి వాళ్లను మెచ్చుకోవాలన్నాడు భట్. మరి.. షమీని ప్రశంసిస్తూ సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని రుణం తీర్చుకున్న షమి.. మాహీ ఫ్యాన్స్ గర్వపడేలా చేశాడు!