iDreamPost

క్రికెట్ మ్యాచ్​ను రికార్డు చేయడానికి ఎన్ని కెమెరాలు వాడతారో తెలుసా?

  • Author singhj Published - 11:32 AM, Thu - 23 November 23

ఒక క్రికెట్ మ్యాచ్​ను రికార్డు చేయడానికి ఎన్ని కెమెరాలు వాడతారో మీకు తెలుసా? క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం వెనుక ఎన్ని కెమెరాలు పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక క్రికెట్ మ్యాచ్​ను రికార్డు చేయడానికి ఎన్ని కెమెరాలు వాడతారో మీకు తెలుసా? క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం వెనుక ఎన్ని కెమెరాలు పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 11:32 AM, Thu - 23 November 23
క్రికెట్ మ్యాచ్​ను రికార్డు చేయడానికి ఎన్ని కెమెరాలు వాడతారో తెలుసా?

క్రికెట్​ను ఆదరించే దేశాల్లో భారత్ అందరికంటే ముందంజలో ఉంటుంది. జెంటిల్మన్ గేమ్​కు గుండె చప్పుడు ఇండియా అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దేశ ప్రజల జీవితాల్లో ఈ గేమ్ అంతర్భాగంగా మారింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు తమ స్కూల్ లేదా కాలేజ్​ లైఫ్​లో బ్యాట్ పట్టి షాట్ కొట్టిన వారే అయి ఉంటారు. క్రికెట్​ బాల్​తో దాదాపుగా అందరికీ రిలేషన్ ఉంటుంది. క్రికెట్ మన దేశంలో ఎందుకంత ఫేమసో చెప్పేందుకు రీసెంట్​గా జరిగిన వన్డే వరల్డ్ కప్-2023ని బిగ్ ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. మెగా టోర్నీకి ఆడియెన్స్ నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించింది. క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక మంది ప్రేక్షకులు స్టేడియాల్లో వీక్షించిన వరల్డ్ కప్​గా ఇది రికార్డు నమోదు చేయడం విశేషం.

45 రోజుల పాటు సాగిన వరల్డ్ కప్ క్రికెట్ లవర్స్​ను ఎంతగానో అలరించింది. లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్స్ వరకు ఎన్నో ఉత్కంఠ రేపే మ్యాచ్​లు, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్​తో ఆడియెన్స్​ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా టీమిండియా ఆడిన మ్యాచులకైతే స్టేడియాలు నిండిపోయాయి. వరల్డ్ కప్ జరిగింది భారత్​లో కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉంది. వేరే దేశాల్లోనూ జరిగితే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పలేం. అందుకే క్రికెట్​కు భారత్ చాలా కీలకమని అంటుంటారు. ఇక, జెంటిల్మన్ గేమ్​ అంటే పడిచచ్చే వాళ్లు మన దేశంలో చాలా మందే ఉన్నారు.

క్రికెట్​కు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. టీమ్స్, ప్లేయర్స్​కు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనే కుతూహలం క్రికెట్ లవర్స్​కు ఎక్కువగా ఉంటుంది. అందుకే టీమ్ సెలక్షన్, మ్యాచ్ ప్రాక్టీస్ దగ్గర నుంచి మ్యాచులు, రిజల్ట్స్, అవార్డ్స్ వరకు క్రికెట్​తో ముడిపడిన ప్రతి విషయంపై ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికో ప్రశ్న. జెంటిల్మన్ గేమ్​లో ఎన్ని కెమెరాలు వాడతారో మీకు తెలుసా? గేమ్​ను ఫాలో అయ్యే చాలా మంది మైండ్​లో ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది. అలాంటి వారు ఇది తెలుసుకోవాల్సిందే.

క్రికెట్​లో ఒకప్పుడు కొన్ని కెమెరాలు మాత్రమే వాడేవారు. అయితే ఈ మధ్య టెక్నాలజీ వినియోగం బాగా పెరగడంతో వినియోగించే కెమెరాల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఒక క్రికెట్ మ్యాచ్​ను రికార్డు చేయడానికి, లైవ్​గా టెలికాస్ట్ చేయడానికి 29 కెమెరాలను వాడతారట. ఇందులో 19 నుంచి 20 కెమెరాలు మ్యాన్యువల్​గా ఉంటాయట. ఇవి మనుషులు దగ్గర ఉండి ఆపరేట్ చేస్తేనే పనిచేస్తాయట. సో, వీటి వాడకానికి మనుషులు కంపల్సరీ అన్నమాట. మిగిలిన 9 కెమెరాలకు మనుషులు అవసరం ఉండదట. అంటే వీటిని మనుషులు ఆపరేట్ చేస్తారు. కానీ ఈ కెమెరాల వెంట ఎవరూ తిరగాల్సిన అవసరం ఉండదు.

మ్యాన్యువల్ కాని కెమెరాలను ఒక చోట నుంచి రిమోట్ లేదా ఇతర టెక్నాలజీ సాయంతో ఆపరేట్ చేయొచ్చట. అలాంటి కెమెరాల్లో స్పైడర్ కెమెరా, బగ్గీ కెమెరా, హ్యాట్ కెమెరా, స్టంప్ కెమెరా, బ్యాట్స్​మన్ కెమెరా, డ్రోన్ కెమెరాలు వస్తాయి. ఇందులో స్పైడర్ కెమెరా టాప్ యాంగిల్స్​ను, బాల్​తో పాటు ఫాస్ట్​గా మూమెంట్స్​ ఇవ్వగలదట. ఇక, బగ్గీ కెమెరాను బౌండరీల దగ్గర రికార్డింగ్ కోసం వినియోగిస్తారు. మంచి వ్యూ కోసం బ్యాట్స్​మన్​ పెట్టుకునే హెల్మెట్లలో హ్యాట్ కెమెరాను అమర్చుతారు. స్టంప్ కెమెరా గురించి తెలిసిందే. డ్రోన్ కెమెరాను మనం మ్యాచుల్లో రెగ్యులర్​గా చూస్తూనే ఉంటాం. మరి.. క్రికెట్​లో మీకు ఇష్టమైన కెమెరా ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీ20 క్రికెట్​కు రోహిత్ దూరం.. ఇక టీమ్ ఫ్యూచర్ అతడి చేతుల్లోనే..!

 

View this post on Instagram

 

A post shared by Vaasu Gaddam (@vaasutechvlogs)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి