iDreamPost

పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌కు అదిరిపోయే ఆతిథ్యం.. మెనూలో ఏమేం ఉన్నాయంటే

  • Published Sep 28, 2023 | 8:17 PMUpdated Sep 28, 2023 | 8:17 PM
  • Published Sep 28, 2023 | 8:17 PMUpdated Sep 28, 2023 | 8:17 PM
పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌కు అదిరిపోయే ఆతిథ్యం.. మెనూలో ఏమేం ఉన్నాయంటే

మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. 2023 అక్టోబరు 5 నుండి 2023 నవంబరు 19 వరకు జరిగే ఈ టోర్నమెంటుకు ఈసారి భారతదేశం ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో.. దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చింది. బుధవారం రాత్రి పాక్‌ జట్టు.. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంది. కెప్టెన్‌ బాబార్‌ అజామ్‌ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ దుబాయ్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యింది. సెప్టెంబర్ 29వ తేదీన న్యూజిలాండ్‌తో వన్డే ప్రపంచకప్‌ మొదటి వార్మప్‌ మ్యాచ్‌ను పాక్‌ ఆడనుంది.

ఇక హైదరాబాద్‌కు చేరుకున్న పాకిస్తాన్‌ ప్లేయర్స్‌కు హైదరాబాద్‌ అసోసియేషన్‌ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం పాక్‌ ప్లేయర్స్‌ బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్ హోటల్‌లో బస చేస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి పటిష్ట భద్రత నడుమ ప్లేయర్స్‌ను పార్క్‌ హయత్ హోటల్‌కి తీసుకెళ్లారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్‌ చేరుకున్న పాక్‌ ప్లేయర్స్‌కి అదిరిపోయే ఫుడ్‌ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పాక్‌ ప్లేయర్స్‌కి హైదరాబాద్‌ బిర్యానీతో పాటు మటన్‌ కర్రీతో స్పెషల్‌ మెనూను ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటు గ్రిల్డ్‌ ల్యాంబ్‌ చాప్స్‌, బటర్‌ చికెన్‌, గ్రిల్డ్‌ ఫిష్‌ వంటివి మెనులో భాగంగా వారి కోసం ఏర్పాటు చేశారు. ఇక పాకిస్తాన్‌ ప్లేయర్స్‌ కోసం ప్రత్యేకంగా ఉడికించిన బాస్మతి రైస్‌, బోలోగ్నీస్‌ సాస్‌తో కూడిన స్పాగెట్టి, వెజ్‌ పులావ్‌ వంటి వాటిని పాక్‌ ప్లేయర్స్‌ మెనూలో చేర్చారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో తమకు లభించిన ఘన స్వాగతం పట్ల పాకిస్తాన్‌ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిది సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఇంత వరకు ఎంత గొప్ప సాదర స్వాగతం ఎప్పుడు లభించలేదు’ అనే అర్థం వచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశాడు. పాక్‌ క్రికెటర్లు హైదరాబాద్‌ విమానశ్రయం నుంచి పార్క్‌ హయత్‌ హోటల్‌కు వెళ్లిన వీడియో తెగ వైరలయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి