iDreamPost
android-app
ios-app

IND vs PAK: టీ20 వరల్డ్ కప్.. ఇండియా-పాక్ మ్యాచ్ కు ఉగ్రముప్పు! ఆందోళనలో అభిమానులు..

  • Published May 30, 2024 | 1:33 PM Updated Updated May 30, 2024 | 1:33 PM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాక్ మ్యాచ్ కు ఉగ్రముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాక్ మ్యాచ్ కు ఉగ్రముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IND vs PAK: టీ20 వరల్డ్ కప్.. ఇండియా-పాక్ మ్యాచ్ కు ఉగ్రముప్పు! ఆందోళనలో అభిమానులు..

జూన్ 9.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ తో పాటుగా సగటు క్రీడాభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఓ క్రికెట్ యుద్ధం జరగబోతోంది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా-పాక్ మ్యాచ్ జరిగేది ఆ రోజే. దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ప్రపంచం దృష్టి మెుత్తం ఈ పోరుపైనే ఉంటుంది. అభిమానులు పోటెత్తే ఈ మ్యాచ్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ, అమెరికా ఉగ్రముప్పుపై స్పందించాయి.

టీ20 ప్రపంచ కప్ లో క్రికెట్ అభిమానులు ఎదురుచూసే ఒకే ఒక్క మ్యాచ్ భారత్-పాక్ మ్యాచ్. జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనున్న ఈ పోరు కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆత్రుతగా వేచిచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పోటెత్తుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ కప్ లో హై ఓల్టేజీ మ్యాచ్ అయిన ఈ పోరుకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా-పాక్ మ్యాచ్ కు ఉగ్రముప్పు వార్తల నేపథ్యంలో ఇటు ఐసీసీ, అటు అమెరికా స్పందించాయి. “ఇండియా-పాక్ మ్యాచ్ కే కాదు.. వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ జరిగే మ్యాచ్ లన్నింటికీ.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం. అత్యాధునిక సాంకేతికతతో భద్రతను పటిష్టం చేయాలని న్యూయార్క్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రజల భద్రతే మా ప్రధమ ప్రాధాన్యత. వరల్డ్ కప్ లో మ్యాచ్ లను ప్రేక్షకులు ఆస్వాదించేలా చర్యలు తీసుకుంటున్నాం” అని న్యూయార్క్ గవర్నర్ కాచీ హోతుల్ తెలిపారు. ఐసీసీ సైతం వివిధ అంచెల్లో భద్రతను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రతి ఒక్కరి భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఇక ఈ మెగాటోర్నీలో ఇండియా తన తొలి మ్యాచ్ లో జూన్ 5న ఐర్లాండ్ తో తలపడబోతోంది.