iDreamPost
android-app
ios-app

మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత.. మియా డామినేషన్ మామూలుగా లేదుగా!

  • Author singhj Published - 11:27 AM, Thu - 26 October 23

వరల్డ్ కప్​లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతగా వికెట్లు తీయకున్నా స్టార్టింగ్​లో అద్భుతమైన స్పెల్స్​ వేస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. అలాంటి సిరాజ్ మియా ఓ అరుదైన ఘనత సాధించాడు.

వరల్డ్ కప్​లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతగా వికెట్లు తీయకున్నా స్టార్టింగ్​లో అద్భుతమైన స్పెల్స్​ వేస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. అలాంటి సిరాజ్ మియా ఓ అరుదైన ఘనత సాధించాడు.

  • Author singhj Published - 11:27 AM, Thu - 26 October 23
మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత.. మియా డామినేషన్ మామూలుగా లేదుగా!

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా జోరును అడ్డుకోవడం ఎవరి వల్లా కావడం లేదు. ఎదురొచ్చిన ప్రతి టీమ్​ను చిత్తు చిత్తుగా ఓడిస్తూ పాయింట్స్ టేబుల్​లో టాప్​ ప్లేస్​లో కూర్చుంది భారత్. ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లతోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ లాంటి ఫేవరెట్స్ కూడా రోహిత్ సేనను ఆపలేకపోయాయి. ఇంకో మ్యాచ్ గెలిస్తే ఈ ప్రపంచ కప్​లో సెమీస్ చేరిన తొలి టీమ్​గా భారత్ నిలుస్తుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇంగ్లండ్​తో జరిగే మ్యాచ్​లో కీలకంగా మారనుంది. మన టీమ్ ఇంత పవర్​ఫుల్​గా మారడానికి ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్సే ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

ఈ వరల్డ్ కప్​లో ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లో టీమిండియా అదరగొట్టింది. భారత్ బలం బ్యాటింగ్ అనేది తెలిసిందే. అయితే ఇప్పుడు బౌలర్లు మన టీమ్ సక్సెస్​లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అద్భుతమైన బౌలింగ్​తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. దీంతో రోహిత్ అండ్ కోకు ఛేజ్ చేయడం మరింత ఈజీ అవుతోంది. పేసర్లు బుమ్రా, సిరాజ్​, షమీతో పాటు స్పిన్నర్లు జడేజా, కుల్దీప్​ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇదే ఊపును ఇంగ్లండ్​తో జరిగే మ్యాచ్​లోనూ కొనసాగిస్తే రోహిత్ సేనకు తిరుగుండదు. ఇక, ఐసీసీ ర్యాంకింగ్స్​లో భారత క్రికెటర్ల హవా నడుస్తోంది. ఐసీసీ ర్యాంకింగ్స్​లో అటు బ్యాటర్లతో పాటు ఇటు బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం.. వన్డేల్లో బ్యాటర్ల లిస్టులో టీమిండియా ఓపెనర్ శుబ్​మన్ గిల్ (823 పాయింట్లు) రెండో స్థానానికి చేరాడు.

వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్​లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (747) ఆరో ప్లేసులో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (668) రెండో స్థానంలో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా స్పీడ్​స్టర్ జోష్ హేజల్​వుడ్ (670) టాప్​లో ఉన్నాడు. సిరాజ్​కు హేజల్​వుడ్​కు మధ్య ఉన్న తేడా 2 పాయింట్లు మాత్రమే. వరల్డ్ కప్​లో నెక్స్ట్ జరిగే మ్యాచుల్లో మరింత రాణిస్తే సిరాజ్ ఫస్ట్ ప్లేస్​కు చేరుకునే ఛాన్స్ ఉంది. టీమిండియాకు బ్యాటర్లే బలం అనుకుంటారు. కానీ బుమ్రా, సిరాజ్ లాంటి వాళ్లు బౌలింగ్​లోనూ భారత్​కు ఎవరూ సాటిలేరని నిరూపిస్తున్నారు. ర్యాంకింగ్స్​లో సిరాజ్ అరుదైన ఘనత గురించి తెలిసిన ఫ్యాన్స్ అతడ్ని మెచ్చుకుంటున్నారు. సిరాజ్ మియా డామినేషన్​ మామూలుగా లేదని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సిరాజ్​ పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇంగ్లండ్​తో మ్యాచ్​కు ముందు గిల్ వార్నింగ్.. బయటకు తీస్తానంటూ..!