iDreamPost

శరవేగంగా జిల్లాల విభజన ప్రక్రియ: 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష పూర్తి

శరవేగంగా జిల్లాల విభజన ప్రక్రియ: 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష పూర్తి

ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎలా అయినా ఉగాది నుంచి కొత్తజిల్లాల పాలన మొదలు పెట్టాలని వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాల విభజనపై వస్తున్న అభ్యంతరాలను సేకరించిన ప్రభుత్వం వాటిని సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల విభజన ప్రక్రియపై ప్రణాళికశాఖ సెక్రటరీ విజయ్‌ కుమార్ స్పందించారు. విశాఖపట్నంలో విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విశాఖలో నాలుగు జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు పరిశీలించామని, వాటిలో ఏవి సహేతుకంగా ఉన్నాయి..ప్రజలయొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి అనేది పరిశీలించామని అన్నారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష జరిపామని ఇంకా నెల్లూరు జిల్లా పూర్తి కావాల్సి ఉంది అని అన్నారు.. అదికూడా పూర్తిచేసి తుదినివేదిక ప్రభుత్వంకు ఇస్తామని ఆయన అన్నారు. ఇక ఏప్రిల్ 2న ప్రకటన వస్తుంది… ఉగాది  నుండి కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అనేక అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. విశాఖ నుండి  250, ఈస్ట్ నుండి 300, విజయనగరం నుంచి 4000, శ్రీకాకుళం నుంచి 40 అభ్యంతరాలు వచ్చాయని ఆయన వెల్లడించారు.

అయితే శాస్త్రీయ పద్దతిలో  జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశామని పేర్కొన్న ఆయన 2020-2021 జనాభా లెక్కల గణన జరగాలి కాని కోవిడ్ కారణంగా వాయిదా పడిందని అన్నారు. బౌండరీలకు సంబందించి కేంద్రం జూన్ 30 లోపు చేసుకోమని చెప్పింది కానీ ఏప్రియల్ లోనే పూర్తి చేయ్యాలని భావిస్తున్నామని అన్నారు. పరిపాలన కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భవనాలు,భూములు వినియోగిస్తాం…అనివార్యం అయితే ప్రైవేటు భవనాలు ఉపయోగిస్తామని విజయ్ కుమార్ పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి