SNP
SNP
‘ఆ రోజు సచిన్‌ను గాయపర్చాలనే కసితోనే బౌలింగ్ చేశా.. ఇంజుమామ్ ఉల్ హక్ బౌన్సర్లు వేయొద్దని చెప్పినా వినకుండా.. సచిన్‌ను కొట్టాలనే బాల్ వేశా.. ఒక బాల్ అతని తలకు బలంగా తగిలింది. ఆ దెబ్బతో సచిన్ చనిపోయాడు అనుకున్నా..’ ఇవి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన చాలా కాలం తర్వాత.. అక్తర్ ఈ సంచలన నిజాలను వెల్లడించాడు. గతంలో ఇండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు యుద్ధాన్ని తలపించేవి. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, గొడవలతో మ్యాచ్ ఎంత ఉత్కంఠగా, ఉద్విగ్న వాతావరణంలో సాగేది.
ప్రస్తుతం భారత్-పాక్ ఆసియా కప్‌లో తలపడుతున్న నేపథ్యంలో.. అప్పటి మ్యాచ్‌ల గురించి ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2006లో నేషనల్ స్టేడియంలో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ఆ రోజు సచిన్‌కి ఉద్దేశపూర్వకంగా బౌన్సర్లు వేసి గాయపర్చాలని అనుకున్నట్లు పేర్కొన్నాడు. అక్తర్ మాట్లాడుతూ.. ‘మొదటి సారి ఈ విషయం వెల్లడిస్తున్నాను.. ఆ మ్యాచ్‌లో సచిన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీవ్రంగా గాయపరచాలని అనుకున్నాను. షార్ట్ బాల్ కాకుండా.. కాస్త ముందుకు బాల్ వేయాలని కెప్టెన్ ఇంజామ్ ఉల్ హక్ చెప్పినా వినలేదు.
సచిన్‌ను కొట్టాలనే ఫిక్స్ అయ్యాను. ఒక బాల్ సచిన్ హెల్మెట్‌కు బలంగా తాకింది. అప్పుడు సచిన్ చనిపోతాడనే అనుకున్నాను. అప్పుడు నేను రీప్లే చూశాను. ఆ బాల్ సచిన్ నుదుటికి తాకినట్టు చూశాను. ఆ తర్వాత మళ్లీ సచిన్‌ను గాయపరచాలని బాల్ వేశాను’ అని షోయబ్ అన్నాడు. ప్రస్తుతం అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ విషయంపై ఇండియన్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్తర్ ఇప్పుడే కాదు గతంలో ధోని విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ధోనిని గాయపర్చాలని బౌలింగ్ వేసినట్లు కూడా వెల్లడించాడు. కానీ, అక్తర్ బౌలింగ్‌ను సచిన్, ధోని చీల్చిచెండారు కానీ గాయాల పాలు కాలేదు. మరి అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What if @shoaib100mph wanted to k!ll @sachin_rt with bouncers aiming his head? Let’s play cricket @BCCI. Cricket is beyond boundaries for Indians.pic.twitter.com/rkQ2S7mlvf
— Pakistan Untold (@pakistan_untold) September 10, 2023
ఇదీ చదవండి: VIDEO: సాంట్నర్ స్టన్నింగ్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..!