iDreamPost
android-app
ios-app

హైపర్ ఆది స్పీచ్ చిరుకి శాపం అయ్యిందా? మంచోడిని ముంచేశాడు!

  • Author Soma Sekhar Published - 06:14 PM, Mon - 14 August 23
  • Author Soma Sekhar Published - 06:14 PM, Mon - 14 August 23
హైపర్ ఆది స్పీచ్ చిరుకి శాపం అయ్యిందా? మంచోడిని ముంచేశాడు!

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ నంబర్ 1 స్టార్ హీరోగా ఆయన చూడని హిట్లు లేవు. అలాగే ఆయన చూడని ప్లాపులూ లేవు. సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఉప్పొంగి.. డిజాస్టర్ అయితే డిలా పడే వ్యక్తి కాదు మెగాస్టార్. జయాపజయాలను రెండింటిని సమానంగా స్వీకరించే వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆ గుణమే మెగాస్టార్ ను ఇండస్ట్రీలో ఓ వ్యవస్థగా మార్చి నంబర్ 1 స్థానాన్ని కట్టబెట్టింది. సినిమా ఇండస్ట్రీలో నట శిఖరంగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి సొంత అభిమానుల నుంచే సమస్యలు ఎదురౌతున్నాయా? అంటే అవుననే అంటున్నారు కొంత మంది నెటిజనులు. తాజాగా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ చిరూకి శాపంగా మారిందని కొంతమంది నెటిజనులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

సాధారణంగా సినిమా ఫంక్షన్స్ లో హీరోలను పొగడటం సర్వసాధారణమైన విషయమే. సదరు హీరోలతో తమకున్న అనుబంధాన్ని నటీ, నటులు ఈ సందర్భంగా తెలియజేస్తుంటారు. అలానే తన అభిమాన హీరో అయిన మెగాస్టార్ పై ఉన్న అభిమానాన్ని పవర్ ఫుల్ స్పీచ్ తో భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తెలియజేశాడు హైపర్ ఆది. అయితే ఆ స్పీచ్ మెగాస్టార్ కు శాపంగా మారిందని కొందరు మెగా అభిమానులే సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. దానికి కారణం ఏపీ ప్రభుత్వానికి చిరంజీవికి మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడమే.

కాగా.. ఈ గ్యాప్ ను హైపర్ ఆది తన స్పీచ్ ద్వారా ఇంకాస్త ఎక్కువ చేశాడని కొందరు సినీ పండితులు, రాజకీయ విశ్లేషకులు, నెటిజనులు అభిప్రాయ పడుతున్నారు. భోళా శంకర్ ఈవెంట్ లో ఆది ఏ రేంజ్ లో స్పీచ్ ఇచ్చాడో మనందరికి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో ఎన్నో ప్లాపు సినిమాలు ఉన్నాయి. అయితే ఆ సినిమాలు ఫెయిల్ అయినప్పుడు ఈ విధంగా ట్రోల్స్ గానీ, విమర్శలు గానీ రాలేదు. కేవలం హైపర్ ఆది స్పీచ్ వల్లే మెగాస్టార్ పై ఇంత ఘోరంగా విమర్శలు వస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

ఇక భోళా శంకర్ సినిమా అనుకున్న స్థాయిలో ఉండకపోవడంతో.. మెగా అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఈ అసంతృప్తి ఒకవైపు అయితే.. ఆది స్పీచ్ ఎఫెక్ట్ చిరుపై మరింతగా పడేలా చేసిందని కొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వానికి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఉన్న చిన్న గీతను హైపర్ ఆది తన స్పీచ్ తో పెద్ద గీతగా మార్చడని చెప్పుకొస్తున్నారు. మరి నిజంగానే మెగాస్టార్ ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడానికి కారణం ఆది స్పీచేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: అమలాపాల్ ఓ చెత్త హీరోయిన్! స్టార్ హీరో సంచలన కామెంట్స్!

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet