iDreamPost

అమలాపాల్ ఓ చెత్త హీరోయిన్! స్టార్ హీరో సంచలన కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 05:35 PM, Mon - 14 August 23
  • Author Soma Sekhar Published - 05:35 PM, Mon - 14 August 23
అమలాపాల్ ఓ చెత్త హీరోయిన్! స్టార్ హీరో సంచలన కామెంట్స్!

ఇండస్ట్రీలో నటీ, నటులు తమ తోటి నటులపై అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఇంటర్వ్యూల్లో హీరో, హీరోయిన్స్ తమకు జరిగిన చేదు అనుభవాలను సభాముఖంగా వెల్లడిస్తుంటారు. కొంత మంది మాత్రం మెహమాటానికి సదరు వ్యక్తులపై కోపం ఉన్నాగానీ.. ఏదో పైకి అలా పొగుడుతూ ఉంటారు. కానీ ఈ స్టార్ హీరో మాత్రం ఏ మాత్రం భయం, బెరుకు లేకుండానే అమలాపాల్ ఓ చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఆమె చెత్త హీరోయిన్ అన్న విషయాన్ని ఆమెకే చెప్పానని స్టార్ హీరో తెలపడం గమనార్హం.

అథర్వ మురళీ.. 2019లో విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు ఈ హీరో. ప్రస్తుతం అతడు కోలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. ప్రముఖ తమిళ హీరో మురళి కొడుకే ఈ అథర్వ అన్న విషయం తెలిసిందే. 2010లో వచ్చిన ‘బాణకాతాడి’ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ హీరో. ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన మూడు సంవత్సరాలకే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు అథర్వ. తాజాగా అతడు నటించిన ‘మధకం’ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలాపాల్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు అథర్వ.

ఇంటర్వ్యూలో అథర్వ మురళి మాట్లాడుతూ..”ముహుదుముత్ ఉన్ కర్పనై సినిమాలో మేమిద్దరం కలిసి నటించాం. అది నా రెండో సినిమా. అయితే షూటింగ్ ప్రారంభం అయిన పది రోజుల్లో ఆమెతో నాకు చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల నేను చాలా బాధపడ్డాను. తర్వాత మా ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. కానీ అమలాపాల్ ఓ చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేను నేరుగా ఆమెతోనే చెప్పాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అథర్వ మురళి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. కాగా.. అమలాపాల్ కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిత్వానికి చెందినది. దీంతో ఈ వ్యాఖ్యలపై ఆమె ఏవిధంగా రియాక్ట్ అవుతుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అథర్వ మురళి అమాలాపాల్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: హైపర్ ఆదితో పెళ్లి వార్తలు! క్లారిటీ ఇచ్చిన యాంకర్ వర్షిణి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి