iDreamPost

రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

మండుటెండల్లో వర్షాలు కురుస్తుండడంతో ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మండుటెండల్లో వర్షాలు కురుస్తుండడంతో ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనాలు ఎండవేడిమితో, ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. కాలు తీసి బయటపెట్టలేని పరిస్థితి దాపరించింది. ఇంతటి మండుటెండల్లో వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటీవల పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆకస్మిక వానలతో ఎండ నుంచి ఉపశమనం లభించినా.. ఇది వరి కోతల సమయం కావడంతో రైతులకు నష్టాన్ని మిగుల్చుతోంది.

తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

Rain Alert Rains for four days

సోమవారం నుంచి మంగళవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డిలో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం నుంచి గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి