Swetha
సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే.. ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేయడం అనేది చూస్తూనే ఉంటాము. అయితే, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ విషయంలో కాస్త క్రియేటివ్ గా ఆలోచించారు.
సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే.. ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేయడం అనేది చూస్తూనే ఉంటాము. అయితే, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ విషయంలో కాస్త క్రియేటివ్ గా ఆలోచించారు.
Swetha
ఇటీవల సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది ఎవరంటే.. అందరు సులువుగా చెప్పే పేరు ‘కుమారి ఆంటీ’. కొద్దీ రోజులపాటు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది కుమారి ఆంటీ. అయితే, కుమారి ఆంటీని ఇంత ఫేమస్ చేసిన తన డైలాగ్ .. “మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్ట్రా”. ఈ ఒక్క డైలాగుతో కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయిపోయింది. ఇక ఏదైనా ఫేమస్ అయితే దానిని ఇంస్టాలో రీల్స్ గా మార్చేయడం, అందరు దీనిని ఇమిటేట్ చేయడం కామన్ . కానీ, ట్రాఫిక్ పోలీసులు కూడా ఇదే డైలాగ్ ను .. యూజ్ చేయడం మాత్రం కాస్త వెరైటీగా అనిపించింది అందరికీ. తాజాగా హైదరాబాద్ చలానాలు వేసే క్రమంలో.. సోషల్ మీడియాలో ట్రాఫిక్ పోలీసులు పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్ గా మారింది.
కుమారి ఆంటీ ఈమె చుట్టూ ఎన్నో చర్చలు, పోట్లాటలు.. జరిగాయి. తర్వాత మెల్లగా సోషల్ మీడియా నుంచి బుల్లితెరపైన కూడా ఎంట్రీ ఇచ్చింది కుమారి ఆంటీ. చూస్తుంటే కేవలం ఒకే ఒక్క డైలాగు ఈమె జీవితాన్నే మార్చేసినట్లుగా భావిస్తున్నారు నెటిజన్లు. అయితే, బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ డైలాగును ఇప్పుడు .. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా యూస్ చేయడం స్టార్ట్ చేసారు. హెల్మెట్ లేకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేసిన .. ట్రాఫిక్ పోలీసులు.. ‘మీది మొత్తం 1000 అయింది.. యూజర్ ఛార్జెస్ ఎక్స్ ట్రా’ అంటూ ట్వీట్ చేశారు. అలా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం.. అందులోను కాల్ మాట్లాడడం అనేది సరైనది కాదు. ఈ విషయంపై అవగాహనా కలిపించాడనికి.. ఇలా కుమారి ఆంటీ డైలాగును యూస్ చేసుకుంటూ .. కాస్త క్రియేటివ్ గా అందరికి తెలియజేశారు టాఫిక్ పోలీసులు.
అయితే, ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే.. దానికి తగిన చలానాలు తప్పవని.. తరచూ ట్రాఫిక్ పోలీసులు చెప్తూనే ఉంటారు. వాహనదారులు కూడా దానిని పెడచెవిన పెడుతూ ఉంటారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ బాగా పెరిగిపోతున్న క్రమంలో.. ఈ రకంగా అయినా ప్రజలకు అవగాహనా కల్పించాలనే ప్రయత్నంలో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇలా కుమారి ఆంటీ ఫేమస్ డైలాగును యూస్ చేసుకున్నారు. ఈ రకంగా ట్రాఫిక్ పోలీసులు కూడా అప్ డేట్ అవుతూ.. వాహనదారులకు ఎదో ఒక రకంగా ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పించడమ్ అనేది మెచ్చుకోతగ్గ విషయం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Midhi motham 1000 ayindhi, user charges extra…#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov
— Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024