iDreamPost
android-app
ios-app

వీడియో: అమ్మాయిలను టచ్ చేస్తున్నారా? పోలీసుల వార్నింగ్!

వీడియో: అమ్మాయిలను టచ్ చేస్తున్నారా? పోలీసుల వార్నింగ్!

మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొస్తున్నప్పటికి ఆకతాయిల్లో మాత్రం మార్పురావడం లేదు. యువతులు, మహిళలు కనిపిస్తే చాలు వెకిలి చూపులు, వికృత చేష్టలతో ఆకతాయిలు రెచ్చిపోతుంటారు.రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో అమ్మాయిలను టచ్ చేస్తున్నారా.. అయితే అలాంటి వారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఎవరు చూస్తారులే అని తమ వికృత చేష్టలతో రెచ్చిపోయే ఆకతాయిల భరతం పడుతున్నారు. అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తించే అల్లరి మూకలను జల్లెడ పట్టి మరి వార్నింగ్ ఇస్తున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ ప్రభుత్వం మహిళా రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. షీటీమ్స్ ను ఏర్పాటు చేసి ఆకతాయిల ఆటకడుతోంది. మహిళలు, యువతులను గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో, క్యూలైన్లలో, ట్రైన్లల్లో ఆకతాయిలు వారిని అసభ్యకరంగా తాకుతూ.. మీద చేతులు వేయడం, వెకిలి నవ్వుల, వెకిలి చూపులతో వేధింపులకు గురిచేస్తుంటారు. ఆ క్షణానికి వికృతానందం పొందుతుంటారు. ఈ విధంగా ప్రవర్తించే ఆకతాయిలకు తగిన బుద్ది చెబుతున్నారు హైదరాబాద్ పోలీసులు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని షీ టీమ్స్ కనిపెడుతోంది.

ఆ ఘటనలను వీడియో తీసి, వేధింపులకు పాల్పడిన వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేస్తోంది. తాజాగా ఈ అంశానికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై స్పందించిన నెటిజన్లు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో ద్వారా పోలీసులు ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు. మీరు చేసే పనులన్నీ చూస్తున్నాం.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, మంచి ప్రవర్తనతో మెలగాలని హెచ్చరించారు. జనాలు గుమిగూడిన ప్రాంతాల్లో మహిళలను తాకుతున్న పోకిరీల దృశ్యాలను షీ టీమ్స్ వీడియో తీసి వారిని అరెస్ట్ చేశాయని తెలిపారు.

Jojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş