iDreamPost

Hyderabad రోడ్లపై ఒంటరిగా వెళ్తున్నారా.. జాగ్రత్తగా లేకపోతే ఇక అంతే

  • Published May 23, 2024 | 8:31 PMUpdated May 23, 2024 | 8:31 PM

హైదరాబాద్‌ రోడ్ల మీద ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదంలో పడతారు అంటున్నారు పోలీసులు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ రోడ్ల మీద ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదంలో పడతారు అంటున్నారు పోలీసులు. ఆ వివరాలు..

  • Published May 23, 2024 | 8:31 PMUpdated May 23, 2024 | 8:31 PM
Hyderabad రోడ్లపై ఒంటరిగా వెళ్తున్నారా.. జాగ్రత్తగా లేకపోతే ఇక అంతే

అర్థరాత్రి కాదు కదా.. పట్టపగలు, జన సంచారం ఉన్న సమయంలో కూడా నగరంలో రోడ్ల మీద ఒంటరిగా వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందుకు దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లు ఒక కారణం అయితే.. వీధి కుక్కలు కూడా మరో కారణం అవుతున్నాయి. మెడలో ఏమాత్రం బంగారం ఉన్నా బయటకు వెళ్లాలంటే.. చైన్‌ స్నాచర్స్‌ గురించి ఆలోచించి భయపడాల్సి వస్తుంది. ఇక కొన్ని వీధుల్లో అయితే కుక్కుల స్వైర విహారం చేస్తూ.. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాయో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌ రోడ్ల మీద ఒంటరిగా తిరిగే వారిని ఉద్దేశించి పోలీసులు అలర్ట్‌ జారీ చేశారు. జాగ్రత్తగా ఉండకపోతే డేంజర్‌లో పడ్డట్టే అంటున్నారు. ఆ వివరాలు..

ఈజీమనీ, చెడు వ్యసనాలకు అలవాటుపడిన వారు.. చైన్‌ స్నాచింగ్‌, దొంగతనాలకు పాల్పడుతూ.. జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈమధ్యకాలంలో నగరంలో సెల్‌ఫోన్‌ దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయి. ఇలాంటి నేరాలకు పాల్పడే వారు.. రోడ్ల మీద ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్‌ చేసుకుని.. చైన్‌ స్నాచింగ్‌, మొబైల్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో రోడ్ల మీద ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్‌ చేసుకుని.. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్లు దొంగతనం చేస్తోన్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు యువకులు, నలుగురు మైనర్లు ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని నేరేడ్‌మెంట్‌ ప్రాంతానికి చెందిన రోహన్‌ రాజ్‌(19), సికింద్రబాద్‌, తిరుమలగిరికి చెందిన వి.డి.వివియన్‌ రాజ్‌(19) ఇద్దరు స్నేహితులు. వీరికి చదువు పెద్దగా అబ్బలేదు. జల్సాలకు అలవాటు పడ్డారు. ఎంజాయ్‌ చేయడం కోసం డబ్బులు కావాలి. దాంతో దొంగతనాలు ప్రారంభించారు. వీరిద్దరితో పాటు తిరుమలగిరి ప్రాంతానికి చెందిన మరో నలుగురు మైనర్లను కలుపుకుని.. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి, తెల్లవారుజాము వేళలో బైక్‌ల మీద వెళ్తూ.. ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్‌ చేసుకుని.. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు లాక్కుని పారిపోతున్నారు.

ఈ క్రమంలో తాజాగా నేరేడ్‌మెట్‌, తిరుమలగిరి ప్రాంతాల్లో.. ఇలా సెల్‌ఫోన్లు పొగొట్టుకున్న బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ గ్యాంగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం అనగా మే 21న ఉదయం సికింద్రబాద్‌ ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు.. వీరి వద్ద నుంచి సెల్‌ఫోన్లు కొనుగోలు చేసిన యువకులతో కలిపి మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు రాత్రవేళ, తెల్లవారుజామున రోడ్ల మీద ఒంటరిగా వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే.. వెంటనే డయల్‌ 100కు కాల్‌ చేయాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి