iDreamPost

బాలిక కోసం పోలీసులు 5 రోజులుగా గాలింపు.. 200 సీసీ కెమెరాలను వడబోస్తే.!

పైన సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న బాలిక గత 5 రోజుల నుంచి కిందట మిస్సైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పైన సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న బాలిక గత 5 రోజుల నుంచి కిందట మిస్సైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాలిక కోసం పోలీసులు 5 రోజులుగా గాలింపు.. 200 సీసీ కెమెరాలను వడబోస్తే.!

ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో వరుసగా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో బాలికల కేసులే ఎక్కువని పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. మిస్సింగ్ అయిన బాలికల ఆచూకి కోసం వారి తల్లిదండ్రులు అంతా వెతికి చివరికి చేసేదేం లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ఇలాంటి కేసుల్లో కొందరు బాలికలు సురక్షితంగా దొరుకుతుంటే.., మరికొందరు బాలికలు మాత్రం శవాలై కనిపిస్తున్నారు. ఈ వరుస మిస్సింగ్ ఘటనలు మరువకముందే ఇటీవల మరో బాలిక కనిపించకుండా పోయింది. 10 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తండ్రి చుట్టు పక్కల కాలనీలో అంతా వెతికాడు. కానీ, ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత తేలింది ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ లోని వెంకటగిరిలో ఓ బాలిక నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఆమె పదో తరగతి చదువుతోంది. అయితే 5 నెలల కిందట ఈ బాలిక తల్లి మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి ఆ అమ్మాయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లింది. స్కూల్ కు వెళ్లడం కూడా మానేసింది. ఈ విషయం ఆ బాలిక సోదరుడికి తెలియడంతో ఈ నెల 9న ఆమెను మందలించాడు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. మరుసటి రోజు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది. ఆ రోజు సాయంత్రమైన తిరిగి ఇంటికి రాలేదు.

ఆమె కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. కానీ, ఆ బాలిక ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేంలేక ఆ బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా 5 రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీసులు దాదాపు 200 సీసీ కెమెరాలను వడబోయగా ఆ బాలిక ఓ ప్రాంతంలో నడుచుకుంటున్న వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఓ వ్యక్తి స్కూటీపై వెళ్లినట్లు దృశ్యాల్లో కనిపించింది. ఇక పోలీసులు ఆ బైక్ నెంబర్ ను ట్రేస్ చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత అతడిని ప్రశ్నించగా.. ఆ బాలిక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏడుస్తూ కనిపించిందని, ఏం జరిగిందని ప్రశ్నించగా.. నేను చనిపోతానని చెప్పింది. భయంతో ఆ బాలికను జూబ్లీ బస్ స్టేషన్ వెయిటింగ్ రూంలో ఉంచాను. ఇక మరుసటి రోజు ఆ బాలికను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించానని అతు పోలీసులకు వివరించాడు. అనంతరం పోలీసులు ఆస్పత్రిలో ఉన్న ఆ బాలికను అతడి తండ్రికి అప్పగించారు. దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోలీసులు ఏకంగా 5 రోజుల పాటు శ్రమించి ఆ బాలికను వెతికి పట్టుకోవడంతో వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానింకగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి