Venkateswarlu
Venkateswarlu
సమయానికి జీతాలు పడటం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన హోంగార్డు రవీందర్ ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. రవీందర్ నాలుగు రోజుల కిందట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు రవీందర్‌ను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మూడు రోజులనుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. రవీందర్‌ను బతికించేందుకు డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేశారు.
80 శాతం కంటే ఎక్కువ గాయాలు కావటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, గురువారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ రవీందర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని డీఆర్‌డీఓ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక, హోంగార్డు రవీందర్ మృతితో కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. హోంగార్డు జేఎసీ సైతం రవీందర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరి, జీతాలు సమయానికి పడటం లేదంటూ హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.