iDreamPost
android-app
ios-app

భార్యా, బిడ్డను చంపాడు.. ఆ పాపం ఊరికే పోతుందా!..

భార్యా, బిడ్డను చంపాడు.. ఆ పాపం ఊరికే పోతుందా!..

చేసిన పాపాల ఊరికే పోవని, తప్పకుండా దానికి ఫలితం అనుభవించాల్సి ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఓ వ్యక్తిని అతడు చేసిన పాపమే శాపమై వెంటాడింది. చివరకు ప్రాణాలు తీసుకునేలా చేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో  ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని అనాజ్‌పూర్‌కు చెందిన 35 ఏళ్ల ధనరాజ్‌కు కొన్నేళ్ల క్రితం లావణ్యతో పెళ్లయింది. అతడికి క్రియాన్స్‌ అనే కుమారుడు ఉన్నాడు.

పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి ధన్‌రాజ్‌ అదనపు కట్నం కోసం భార్యను హింసించసాగాడు. ఎంతకీ ఆమె అదనపు కట్నం తేకపోవటంతో క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. లావణ్యను, కూతురు ఆధ్య, కుమారుడు క్రియాన్స్‌ను హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి కోర్టు మార్చి 15 రిమాండ్‌ విధించింది. కొన్ని నెలల పాటు జైలులో ఉన్న ధనరాజ్‌ రెండు నెలల క్రితం బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. అప్పటినుంచి తండి దగ్గరఉంటున్నాడు.

ఏమైందో ఏమో తెలియదు కానీ, ఆదివారం మధ్యాహ్నం ధన్‌రాజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన అతడి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి, తల్లి, తమ్ముడి మరణం కారణంగా ఆధ్య అనాథగా మారింది. బాలిక ఆరు నెలలుగా అమ్మమ్మ దగ్గర ఉంటోంది. బాలిక పరిస్థితికి స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. మరి, తండ్రి క్రూర చర్య కారణంగా అనాథగా మారిన ఆధ్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet