iDreamPost

హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇకపై ట్రాఫిక్ ఫ్రీ సిటీగా..!

Hyderabad Traffic: హైదరాబాద్ మహానగరంలో ఉండే ట్రాఫిక్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ సర్కార్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చే పనిలో పడింది.

Hyderabad Traffic: హైదరాబాద్ మహానగరంలో ఉండే ట్రాఫిక్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ సర్కార్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చే పనిలో పడింది.

హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇకపై ట్రాఫిక్ ఫ్రీ సిటీగా..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ సర్కార్ పలు కీలకమైన, కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అవసరమైతే ఇప్పటికే ఉన్న నింబధనలను సడలించాడనికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఇప్పుడు రేవంత్ సర్కార్ తమ దృష్టిని హైదరాబాద్ ట్రాఫిక్ మీద పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేస్తామంటూ గతంలో కూడా వెల్లడించారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, అధికారులకు రేవంత్ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ అదుపులోకి రావాలి అంటున్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎట్టి పరిస్థుతుల్లో హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మార్చాలి అని భావిస్తోంది. అందుకు తగినట్లుగా ఇప్పటికే పలుమార్లు రేవంత్ ఈ సమస్యపై సమీక్షలు కూడా నిర్వహించారు. పోలీసులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు కూడా జారీ చేశారు. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చేందుకు అవసరమైతే నిబంధనలు మార్చడానికి కూడా వెనుకాడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో హైదరాబాద్ నగర సీపీ, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సమస్యలు, పరిష్కార మార్గాలపై దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలో నిరంతరం ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ జరుగుతాయన్నారు. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్కింగ్ ఆక్రమణలకు పాల్పడే వారిపై కూడా కొరడా ఝళిపిస్తామన్నారు. నింబధనలు పాటించని వారికి చలాన్లు వేయడం మాత్రమే కాకుండా.. ముక్కు పిండి మరీ వసూలు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్ పాటించని వాళ్లు ఎవరైనా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

గూడ్స్, హెవీ వెహికల్స్ కు కూడా సీపీ సమయాలను గుర్తు చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు నగరంలోని ఎంటర్ కాకూడదని.. నిర్దేశిత సమయాల్లో మాత్రమే గూడ్స్ వాహనాలు నగరంలోకి రావాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ లెస్ సిటీగా హైదరాబాద్ ను మార్చేందుకు కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు సీపీ తెలిపారు. ట్రాఫిక్ మంతి నిర్వహిస్తూ అర్బన్ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు, రూల్స్ పాటించడంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహనం నడిపే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ డ్రైవింగ్ చేసి ఇంట్లో వారి జీవితాల్లో విషాదం నింపొద్దని కోరుకున్నారు. మరి.. కొత్త రూల్స్ తో హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ సిటీ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి