iDreamPost

జైలర్ ‘హుకుం’ vs దేవర ‘ఫియర్’.. వీటిలో ఏ సాంగ్ బాగుందంటే?

Hukum vs Fear: ఇన్నాళ్లు సినిమాల మధ్య పోటీ ఉండేది. ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడితే ఆ సినిమా తోపు. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆ సినిమా తోపు. ఇప్పుడు ఆ పోటీ పాటలకు కూడా వచ్చేసింది. జైలర్ హుకుం, దేవర ఫియర్ పాటల మధ్య పోలిక పెడుతున్నారు ఫ్యాన్స్. ఈ రెండు సాంగ్స్ లో ఏ పాట బాగుంది? అని.

Hukum vs Fear: ఇన్నాళ్లు సినిమాల మధ్య పోటీ ఉండేది. ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడితే ఆ సినిమా తోపు. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆ సినిమా తోపు. ఇప్పుడు ఆ పోటీ పాటలకు కూడా వచ్చేసింది. జైలర్ హుకుం, దేవర ఫియర్ పాటల మధ్య పోలిక పెడుతున్నారు ఫ్యాన్స్. ఈ రెండు సాంగ్స్ లో ఏ పాట బాగుంది? అని.

జైలర్ ‘హుకుం’ vs దేవర ‘ఫియర్’.. వీటిలో ఏ సాంగ్ బాగుందంటే?

రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఒక లెవల్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇక ఈ మూవీలో హుకుం అనే సాంగ్ మాత్రం అల్టిమేట్ గా నిలిచింది. ఈ పాటలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికీ ఆ సాంగ్ వస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అటువంటి పాటతో ఇప్పుడు దేవరలోని ఫియర్ సాంగ్ పోటీ పడుతుంది. అది కూడా ఎటువంటి ఫియర్ లేకుండా. 

అనిరుద్ మ్యూజిక్ తో ఏదో మ్యాజిక్ చేస్తారు. తాజాగా దేవరలో కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేసినట్లు పాట వింటేనే తెలుస్తోంది. దేవరలో కంపోజ్ చేస్తున్న మ్యూజిక్.. జైలర్ ని మించి ఉంటుంది అని అనిరుద్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన గ్యారంటీలో ఆల్మోస్ట్ దేవరలో ఫియర్ సాంగ్ తో నెరవేరినట్టు కనిపిస్తుంది. ఈ సాంగ్ కి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ ఉంది. అయితే ఈ ఫియర్ సాంగ్ ని రజినీకాంత్ జైలర్ మూవీలోని హుకుం సాంగ్ తో పోల్చుతున్నారు. దేవర యూనిట్, నిర్మాత నాగవంశీ, తారక్ అభిమానులు ఇలా ప్రతి ఒక్కరూ హుకుం సాంగ్ ని మించి ఉంటుందనేలా ఒక హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. 

హుకుం పాట వచ్చినప్పుడు హిట్ అయ్యింది.. అయితే సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ తో ఆ సాంగ్ ఇంకా ఇంకా పెద్ద హిట్ అయ్యింది. సినిమా రిలీజ్ కి ముందు కంటే కూడా రిలీజ్ అయ్యాకే ఆ సాంగ్ ప్రభావం అందరి మీద పడింది. ఇప్పటికీ హుకుం సాంగ్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ సాంగ్ లిరిక్స్ గానీ, మ్యూజిక్ గానీ, విజువల్స్ గానీ, రజినీకాంత్ మ్యానియా ఇవన్నీ సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. తాజాగా ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ కూడా హుకుం రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఫియర్ సాంగ్ కి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్నెట్ లో సాంగ్ ఒక సునామీ సృష్టిస్తుంది. జస్ట్ లిరిక్స్, మ్యూజిక్, అక్కడక్కడా ఎన్టీఆర్ కటౌట్ తోనే ఈ రేంజ్ లో ఉంటే.. ఇక సినిమా విడుదలయ్యాక ఫుల్ సాంగ్ చూస్తే ఉంటుంది నా సామిరంగ. నిజంగా అసలైన పండుగ అప్పుడే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి హుకుంని మించిన సాంగ్ గా ఫియర్ సాంగ్ నిలుస్తుందా? లేదా? అనేది మూవీ రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.   

ఫ్యాన్స్ అంచనా: దూకే రికార్డు జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత.. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి