iDreamPost

బ్రేకింగ్: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది

హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.

హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.

బ్రేకింగ్: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది

హైదరాబాద్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని గగన్ పహాడ్ లోని ఓ షూ షోరూమ్ లో బుధవారం మధ్నాహ్నం ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లోనే ఆ షారూమ్ లో ఉన్న అన్ని వస్తువులు కాలి బూడిదయ్యాయి. నిమిషం నిమిషానికి ఆ మంటలు మరింత ఎక్కువవ్వడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన ఆ షోరూమ్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకుని ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 6 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, దట్టమైన పొగ ఎగిసి పడుతుండడంతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక పక్కనే ఉన్న మిగతా షాపు సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. మంటలు అంటుకున్న సమాయానికి ఆ షోరూమ్ లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని తెలిపారు. ఇంతే కాకుండా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు ఆ షోరూమ్ యాజమాన్యం తెలిపింది. పోలీస్ ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? అసలు ఎలా జరిగిందనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే? షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి